close

ప్రధానాంశాలు

కరోనాపై పోరుకు పారిశ్రామికవేత్తల వితరణ

రూ.5 కోట్ల చెక్కు అందజేసిన మేఘ ఇంజినీరింగు సంస్థ
శాంతాబయోటెక్‌, కేఎన్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్స్‌, క్రెడాయ్‌, మీనాక్షి సంస్థలు కోటి వంతున విరాళాలు
దాతలకు సీఎం, కేటీఆర్‌ల ధన్యవాదాలు

ఈనాడు. హైదరాబాద్‌: కరోనాపై సమరానికి తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన చర్యలకు తమ వంతు సాయంగా మేఘ ఇంజినీరింగు, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ సంస్థ రూ.5 కోట్ల విరాళాన్ని అందజేసింది. శాంతాబయోటెక్‌, కేఎన్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్స్‌, మీనాక్షి గ్రూపు, లారస్‌ ల్యాబ్స్‌ అధినేతలు, క్రెడాయ్‌ ప్రతినిధులు గురువారం పెద్దఎత్తున విరాళాలను ఇచ్చారు. గురువారం ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌, పరిశ్రమలు, ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌లను కలిసి వారు చెక్కులను అందించారు.

* మేఘ ఇంజినీరింగు, ఇన్‌ఫ్రాస్ట్ర్టక్చర్స్‌ మేనేజింగు డైరెక్టర్‌ పీవీ కృష్ణారెడ్డి ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలిసి రూ.5 కోట్ల చెక్కును అందించారు.
* శాంతా బయోటెక్నిక్స్‌ అధినేత, పద్మభూషణ్‌ కేఐ వరప్రసాద్‌రెడ్డి సీఎంను కలిసి ముఖ్యమంత్రి సహాయ నిధికి వ్యక్తిగత సహాయంగా రూ.1,00,00,116 చెక్కును సీఎంకు అందచేశారు. కరోనా వైరస్‌ వ్యాప్తిని నిరోధించడానికి ముఖ్యమంత్రి తీసుకున్న చర్య అభినందనీయమని కొనియాడారు.
* కేఎన్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్స్‌ సంస్థ అధినేత కామిడి నర్సింహారెడ్డి తమ సంస్థ తరఫున రూ.కోటి,
* మీనాక్షి గ్రూపు ఛైర్మన్‌ కేఎస్‌రావు, ఎండీ సి.శివాజీలు రూ. కోటి,
* లారస్‌ ల్యాబ్స్‌ సీఈవో డాక్టర్‌ సత్యనారాయణ, కార్యనిర్వాహక సంచాలకుడు చంద్రకాంత్‌ చేరెడ్డి రూ.50 లక్షల చెక్కును సీఎంకు ఇచ్చారు. లక్ష హైడ్రాక్సి క్లోరోక్విన్‌ టాబ్లెట్లను ఉచితంగా అందిస్తామన్నారు.
* రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్స్‌ అసోసియేషన్‌ (క్రెడాయ్‌) ప్రతినిధులు రూ.కోటి వంతున మంత్రి కేటీఆర్‌కు అందించారు.
* తెలంగాణ ప్రభుత్వ వైద్యులకు ఉపయోగపడే 4 వేల.. ఎన్‌ 95 మాస్క్‌లను జీపీకే ఎక్స్‌పోర్ట్స్‌, ఇంపోర్ట్స్‌ యజమానులు ఫణికుమార్‌, కర్నాల శైలజారెడ్డిలు మంత్రికి అందజేశారు.
* హైదరాబాద్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌ సహ యజమాని విజయ్‌ మద్దూరి రూ.25 లక్షల సీఎంఆర్‌ఎఫ్‌ విరాళం చెక్కును కేటీఆర్‌కు ఇచ్చారు.
* తెలంగాణ పాడి పరిశ్రమాభివృద్ధి సమాఖ్య (విజయ డెయిరీ) ఛైర్మన్‌ లోకభూమారెడ్డి రూ.5 లక్షల విరాళం చెక్కును మంత్రికి అందజేశారు.

దాతలకు సీఎం కృతజ్ఞతలు
కరోనా నివారణలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు సంఘీభావంగా భారీగా విరాళాలు ఇచ్చిన పారిశ్రామికవేత్తలకు సీఎం ధన్యవాదాలు తెలిపారు. ఈ సహాయం ప్రభుత్వ కార్యక్రమాలకు ఉపయోగపడుతుందని, అధికార యంత్రాంగానికి స్ఫూర్తినిస్తుందని చెప్పారు. మంత్రి కేటీఆర్‌ సైతం దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. ఆపత్కాలంలో ప్రజలకు సేవలందించేందుకు భవన నిర్మాణ యజమానులు కార్పొరేటు సామాజిక బాధ్యత కింద  కార్యక్రమాలు చేపట్టాలని, విరాళాలను అందజేయాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.


స్థానిక సంస్థల్లో తెరాస ప్రజాప్రతినిధుల చొరవ
విరాళంగా నెల గౌరవ వేతనం
రూ.9.51 కోట్లు అందజేయాలని నిర్ణయం

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా నిర్మూలన కోసం తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు 18,190 మంది తమకు లభించే ఒక నెల గౌరవ వేతనం మొత్తం రూ.9,51,17,500లను ముఖ్యమంత్రి సహాయనిధికి జమ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు  జిల్లా పరిషత్‌ ఛైర్‌పర్సన్లు, నగరపాలక మేయర్లు, పురపాలక ఛైర్‌పర్సన్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, సర్పంచులు తమ అంగీకారాన్ని గురువారం సీఎం కేసీఆర్‌కు తెలిపారు. రాష్ట్రంలో విపత్కర పరిస్థితులు నెలకొన్న తరుణంలో అటు చట్టసభల్లోనూ, ఇటు స్థానిక సంస్థల్లోనూ పెద్ద సంఖ్యలో ఉన్న తెరాస పార్టీ ప్రజాప్రతినిధులు విరాళాలిచ్చి తమ దాతృత్వాన్ని చాటుకున్నారని సీఎం కొనియాడారు.


పవన్‌ రూ.2 కోట్ల విరాళం

ఈనాడు, అమరావతి: కరోనాపై పోరాటానికి జనసేన అధ్యక్షులు పవన్‌కల్యాణ్‌ రూ.రెండు కోట్ల విరాళం ప్రకటించారు. ఇందులో ప్రధానమంత్రి సహాయ నిధికి రూ.కోటి, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ముఖ్యమంత్రుల సహాయ నిధికి రూ.50 లక్షల చొప్పున సాయం ప్రకటించారు. ఈ విరాళాలను ఆయా ప్రభుత్వాలకు అందజేసేందుకు వీలుగా ఏర్పాట్లు చేయాల్సిందిగా పార్టీ ముఖ్య ప్రతినిధులను పవన్‌ ఆదేశించారు.


ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.