close

ప్రధానాంశాలు

రాత్రి కర్ఫ్యూ పొడిగింపు?

31 తర్వాతా కొనసాగించే యోచన
ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమీక్షలో చర్చ
ఒకటి, రెండు రోజుల్లో తుది నిర్ణయం

ఈనాడు, హైదరాబాద్‌: ప్రస్తుతం రాష్ట్రంలో అమలులో ఉన్న రాత్రి పూట కర్ఫ్యూను ఈనెల 31 తర్వాత కూడా కొనసాగించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్‌ 14 వరకు లాక్‌డౌన్‌ ప్రకటించిన నేపథ్యంలో అందుకనుగుణంగా రాత్రి కర్ఫ్యూను కూడా అప్పటి వరకు పొడిగించాలని చూస్తున్నట్లు సమాచారం. ముఖ్యమంత్రి కేసీఆర్‌ గురువారం నిర్వహించిన సమీక్షలో దీనిపై చర్చించినట్లు తెలిసింది. ఒకటి, రెండు రోజుల్లో నిర్ణయాన్ని వెల్లడించే అవకాశం ఉంది. రాష్ట్రంలో కరోనా నివారణ, లాక్‌డౌన్‌, కర్ఫ్యూ అమలు తీరుపై సీఎం గురువారం ఉన్నతస్థాయి సమావేశం జరిపారు. ఆరోగ్యమంత్రి ఈటల రాజేందర్‌, సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నిత్యావసరాల గురించి బయటకు వచ్చే వారి సంఖ్య ఎక్కువగా ఉంటోందని అధికారులు సీఎంకు వివరించారు. జనం తిరుగుతుంటే కరోనా కట్టడి ఆశించిన స్థాయిలో సాధ్యం కాదని, లాక్‌డౌన్‌, కర్ఫ్యూలను మరింత పకడ్బందీగా అమలు చేయాలని సీఎం అభిప్రాయపడ్డారు. పరిస్థితులు పూర్తిగా అదుపులోకి వచ్చేందుకు మరికొంత సమయం పట్టే అవకాశాలున్నందున  రాత్రి పూట కర్ఫ్యూను కొనసాగించాలని అభిప్రాయపడినట్లు తెలిసింది. సాధ్యమైనంత త్వరగా పేదలకు రేషన్‌ బియ్యం అందించాలని ఆదేశించారు. రూ. 1500 నగదు బదిలీ ప్రక్రియను కూడా చేపట్టాలన్నారు. గ్రామాల్లో ధాన్యం, వ్యవసాయ ఉత్పత్తుల సేకరణను వెంటనే ప్రారంభించాలన్నారు.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.