close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Comments
జీవో 27పై ఆర్థికశాఖ స్పష్టత

హోంగార్డులు, అంగన్‌వాడీలకూ వేతన కోత వర్తింపు

ఈనాడు, హైదరాబాద్‌: కరోనా ప్రభావం నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా జీతాల్లో కోత విధించినట్లు పేర్కొన్న ప్రభుత్వం ఈ ఉత్తర్వులు వర్తించే వర్గాలపై స్పష్టతనిచ్చింది. దీనిపై ఆర్థికశాఖ ఇచ్చిన జీవో 27లోని వివిధ అంశాలపై స్పష్టతనిస్తూ ఆ శాఖ ముఖ్యకార్యదర్శి కె.రామకృష్ణారావు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.

ఉత్తర్వుల్లోని ముఖ్యాంశాలు..
* కోత పూర్తి వేతనానికి (గ్రాస్‌) వర్తిస్తుంది.
* ఇప్పటికే ఈ-కుబేర్‌లో బిల్లులు పంపించి ఉన్నా వేతనంలో కోత అమలవుతుంది.
* మార్చికి సంబంధించి అప్‌లోడ్‌ చేయాల్సిన బిల్లులు సంబంధిత ట్రజరీ ఆఫీసుల్లోనే జీవో 27 ప్రాతిపదికగా పాస్‌ చేస్తారు.
* ఒప్పంద, పొరుగుసేవల ఉద్యోగుల వేతనాల్లో పదిశాతం కోత విధించిన సంగతి తెలసిందే. ఇదే 10 శాతం కోత గౌరవ వేతనంతో పనిచేస్తున్న హోంగార్డులు, అంగన్‌వాడీ వర్కర్లు, అంగన్‌వాడీ సహాయకులు, వీఆర్‌ఏలు, విద్యావాలంటీర్లకు కూడా వర్తిస్తుంది.
* చివరి గ్రేడ్‌ రిటైర్డ్‌ ఉద్యోగుల పింఛన్లలో పది శాతం, ఇతర ప్రభుత్వ ఉద్యోగుల పింఛన్లలో 50 శాతం, అఖిల భారత సర్వీసు విశ్రాంత అధికారుల పింఛన్లలో 60 శాతం కోత ఉంటుంది.
* గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ సంస్థల ఉద్యోగుల వేతనాలకు సంబంధించి ఇప్పటికే సమర్పించిన బిల్లులు, జారీ చేసిన చెక్కులను వెనక్కి తీసుకుని జీవో 27 మేరకు మళ్లీ సమర్పించాలి.
* ఇప్పటికే ఎవరైనా కోత లేకుండా జీతాలు తీసుకున్నా.. వారు జీవో 27 మేరకు ప్రభుత్వం నిర్దేశించిన మొత్తాన్ని మళ్లీ ఖజానాకు జమచేయాల్సి ఉంటుంది.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.