close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Comments
ఏపీలో కరోనాతో మరో ఇద్దరి మృతి

194కి చేరిన పాజిటివ్‌ కేసులు
గుంటూరులో ఒకే కుటుంబంలో ఐదుగురికి

ఈనాడు, అమరావతి, అనంతపురం, గుంటూరు: రాష్ట్రంలో కరోనా వైరస్‌ సోకి శనివారం మరో ఇద్దరు మరణించినట్లు సమాచారం. అనధికార వర్గాల సమాచారం మేరకు.. అనంతపురం జిల్లాలో ఒకరు, కృష్ణా జిల్లాలో మరొకరు మృతి చెందారు. దీన్ని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఈ రెండు మరణాలతో కలిపి, రాష్ట్రంలో కరోనాతో చనిపోయినవారి సంఖ్య మూడుకు చేరింది. మరోపక్క కరోనా కేసుల ఉద్ధృతి సైతం తీవ్రమైంది. శుక్రవారం రాత్రి 10.30 నుంచి శనివారం సాయంత్రం 6 గంటల వరకు కొత్తగా 30 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 194కి చేరింది. ప్రభుత్వం శనివారం సాయంత్రం 6 గంటలకు జారీచేసిన బులెటిన్‌లో... రాష్ట్రంలో అప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 190 అని పేర్కొంది. గుంటూరు జిల్లాలో కొత్తగా ఆరు కేసులు నమోదైనట్టు ఆ బులెటిన్‌లో ప్రభుత్వం పేర్కొనగా, 10 కేసులు వచ్చినట్టు జిల్లా వైద్యాధికారి స్థానికంగా ప్రకటించారు.
* గుంటూరు జిల్లాలో నమోదైన పది కేసుల్లో ఆ నగరానికి చెందినవారే ఏడుగురు. వీరిలో ఐదుగురు ఒకే కుటుంబసభ్యులు. తొలుత ఆ ఇంటి పెద్దకు పాజిటివ్‌ వచ్చింది. ఆయన దిల్లీలో జరిగిన మత సమావేశంలో పాల్గొని వచ్చారు. వెంటనే కుటుంబసభ్యులకూ పరీక్షలు నిర్వహించగా వారికీ వ్యాధి నిర్ధారణ అయింది. వీరిలో ముగ్గురు చిన్నారులు, మరో ఇద్దరు పెద్దవాళ్లు.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.