close

ప్రధానాంశాలు

కరోనా కట్టడికి కేజ్రీవాల్‌ పాంచజన్యం

టెస్టింగ్‌, ట్రేసింగ్‌, ట్రీట్‌మెంట్‌, టీంవర్క్‌, ట్రాకింగ్‌ అండ్‌ మానిటరింగ్‌
లక్షన్నర మందికి పరీక్షలు చేసేందుకు సమాయత్తం
ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ వెల్లడి

ఈనాడు, దిల్లీ: దేశ రాజధాని దిల్లీలో కరోనా మహమ్మారి వ్యాప్తి నియంత్రణకు దక్షిణ కొరియా తరహా విధానాన్ని అమలు చేయబోతున్నట్లు ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రకటించారు. మిగతా దేశాలకంటే రెండు మూడు అడుగులు ముందున్న దేశాలే వైరస్‌ను విజయవంతంగా నియంత్రించగలిగాయని చెప్పారు. అందుకే తాము నిపుణులు, వైద్యులను సంప్రదించి పరీక్షలు(టెస్టింగ్‌), గుర్తించడం(ట్రేసింగ్‌) , వైద్యం(ట్రీట్‌మెంట్‌), కలిసి పనిచేయడం(టీంవర్క్‌), పర్యవేక్షణ(ట్రాకింగ్‌ అండ్‌ మానిటరింగ్‌) వ్యూహాన్ని ఖరారు చేసినట్లు తెలిపారు. పకడ్బందీగా దీన్ని ఆచరణలో పెడతామని స్పష్టం చేశారు. భవిష్యత్తులో 30 వేల మంది క్రియాశీల రోగులు వచ్చినా సేవలు అందించేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. మంగళవారమిక్కడ కేజ్రీవాల్‌ విలేకరులతో మాట్లాడుతూ.. 5 టీ వ్యూహాలను వెల్లడించారు.


పరీక్షలు

విస్తృతంగా సాధారణ పరీక్షలు చేయడానికి 50 వేల మందికి సరిపడా కిట్ల కోసం ఆర్డర్‌. అలాగే లక్ష మందికి ర్యాపిడ్‌ టెస్ట్‌లు చేసే కిట్లు మూడు రోజుల్లోగా సిద్ధం. ఆ వెంటనే హాట్‌స్పాట్‌లలో ర్యాండమ్‌గా పరీక్షలు మొదలు.


గుర్తించడం

పాజిటివ్‌ రోగులను కలిసిన వ్యక్తులను గుర్తించి  అందర్నీ స్వీయ నిర్బంధంలో ఉంచడం. ఇప్పటివరకూ గృహనిర్బంధంలో ఉన్న వారికి చెందిన 27,702 మంది ఫోన్‌ నంబర్లు పోలీసులకు ఇచ్చి నిఘా. మర్కజ్‌కు వెళ్లిన రెండు వేల మంది ఫోన్‌ నంబర్ల ఆధారంగా వారు ఎక్కడికెక్కడికి వెళ్లారో గుర్తించి ఆ ప్రాంతాల దిగ్బంధం.


వైద్యం

ప్రస్తుతం 525 మందికి వివిధ ఆసుపత్రుల్లో చికిత్స. మరో 3 వేల మంది వచ్చినా చికిత్సకు వీలుగా ప్రభుత్వ రంగంలో 2450 పడకలు, ప్రైవేటు రంగంలో 400 పడకల కేటాయింపు. అంతకుమించి వస్తే 1,500 పడకలున్న జీటీబీ ఆసుపత్రి పూర్తిగా కరోనా రోగుల కోసం వినియోగం.


కలిసి పనిచేయడం

కరోనాపై పోరాటానికి అందరితో కలిసి టీంవర్క్‌. ఇందుకు రాజకీయ పార్టీలు, ధార్మిక సంస్థలు, దాతలు, స్వచ్ఛంద సంస్థల సాయం.


పర్యవేక్షణ

ఈ వ్యూహాలు సక్రమంగా అమలయ్యేలా ముఖ్యమంత్రి స్వయంగా 24 గంటలూ ట్రాకింగ్‌ అండ్‌ మానిటరింగ్‌.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.