close

ప్రధానాంశాలు

కరోనా కట్టడికి దిక్సూచి

నిర్ధారణ పరీక్షల పెంపుతో స్పష్టత
తదుపరి చర్యలకు ప్రణాళిక రూపకల్పనకు ఊతం
50 దేశాల్లో వైరస్‌ ఉద్ధృతిపై తెలుగు వైద్యుల అధ్యయనం
‘లాన్సెట్‌’కు పంపించిన పరిశోధన పత్రం
ఈనాడు - హైదరాబాద్‌

రోనా వైరస్‌ను కట్టడి చేయడానికి అనుసరించాల్సిన వ్యూహాల రూపకల్పనకు.. ఎక్కువమందిలో పరీక్షలు నిర్వహించడమనేది ప్రధాన దిక్సూచిగా నిలుస్తుందని తెలుగు వైద్యులు డాక్టర్‌ రాహుల్‌ పొట్లూరి(కార్డియాలజిస్ట్‌), డాక్టర్‌ దీప్తి లావు(గైనకాలజిస్ట్‌) పేర్కొన్నారు. ఎక్కువమందిలో నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం ద్వారా దేశంలో వైరస్‌ బారినపడిన వారిపై ఒక స్పష్టత రావడానికి అవకాశాలున్నాయనీ, తద్వారా కరోనా నియంత్రణకు అనుసరించాల్సిన వ్యూహాల రచనకు, తదుపరి ప్రణాళికల రూపకల్పనకు ఆ ఫలితాలు మార్గదర్శకంగా నిలుస్తాయన్నారు. ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తోన్న కరోనా వైరస్‌పై ఈ వైద్యులిద్దరూ కొంతకాలంగా అధ్యయనం చేశారు. సుమారు 50 దేశాల్లో వైరస్‌ ఉద్ధృతి, అక్కడి కేసుల నమోదు, నిర్ధారణ పరీక్షల తీరు, మరణాల రేటు.. తదితరాలపై పరిశోధన జరిపారు. ఆ అధ్యయన పత్రాన్ని మంగళవారం ప్రఖ్యాత వైద్యపత్రిక ‘లాన్సెట్‌’కు పరిశీలనకు పంపారు. అక్కడ పరిశీలన, ఆమోదానికి కనీసం నెల సమయం పట్టే అవకాశాలుండటంతో.. దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా అధ్యయన పత్రాన్ని సమాచారం నిమిత్తం విడుదల చేస్తున్నట్లు వైద్యులు మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.


సారాంశమిది..

* ఎక్కువగా పరీక్షలు నిర్వహించిన దేశాల్లో మరణాల సంఖ్య తక్కువగా ఉంది. జర్మనీలో 9,18,460 మందిలో పరీక్షలు చేయగా, 91 వేల మందిలో పాజిటివ్‌గా తేలింది. వీరిలో మరణాలు 1275. దక్షిణ కొరియాలో 4,55,000 మందిలో పరీక్షలు నిర్వహించగా, 10వేల మందిలో పాజిటివ్‌గా నిర్ధారించగా, ఇక్కడ 177 మంది మరణించారు. ఆస్ట్రేలియాలోనూ 2,85,000 మందిలో కరోనా పరీక్షలు చేయగా, ఇక్కడ 5500 మందిలో పాజిటివ్‌గా తేలగా, వీరిలో మరణాలు 30.
* తక్కువగా పరీక్షలు చేసిన దేశాల్లో మరణాల సంఖ్య ఎక్కువగా కనిపిస్తోంది. ఇరాన్‌లో 80 వేల పరీక్షలు చేయగా.. 53 వేల కేసులు నమోదయ్యాయి. వీరిలో 3300 మంది మరణించారు. ఫిలిఫ్పైన్స్‌లో 5 వేల పరీక్షలు చేయగా, ఇక్కడ 3 వేల మందిలో పాజిటివ్‌గా నిర్ధారణ కాగా, 136 మరణాలు చోటుచేసుకున్నాయి. ఇండోనేషియాలో 7 వేల పరీక్షలు చేయగా, 2 వేలు పాజిటివ్స్‌ కాగా, 181 మంది చనిపోయారు.
* మన దేశంలోనూ ఎక్కువమందిలో పరీక్షలు నిర్వహించడం ద్వారా వైరస్‌ ఉద్ధృతి ఏ స్థాయిలో ఉందో తెలుస్తుంది.
* ఒకవేళ కేసుల సంఖ్య పెరుగుతున్నట్లు తేలితే.. వైరస్‌ నివారణకు చేపట్టే చర్యల్లో అవసరమైన మార్పులు చేసుకోవచ్చు.
* ఈ అధ్యయనం ప్రకారం.. దేశ జనాభాలో కనీసం 1 శాతం మందిలో కరోనా పరీక్షలు నిర్వహించిన దేశాల్లో సానుకూల ఫలితాలొచ్చాయి.
* ఆ లెక్కన మన దేశంలో కనీసం 1.5 కోట్ల మందిలో పరీక్షలు చేయాలి. ప్రస్తుత పరిస్థితుల్లో అది సాధ్యం కాదు కాబట్టి.. కనీసం 10 లక్షల మందిలోనైనా కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలి.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.