close

ప్రధానాంశాలు

వాహన సంచారంపై ఐటీఎంఎస్‌ నిఘా

లాక్‌డౌన్‌ అమలుపై కంట్రోల్‌రూంలో గంటలవారీగా విశ్లేషణ
రద్దీ కూడళ్లలో పరిస్థితిపై స్థానిక పోలీసులకు సమాచారం
ఈనాడు, హైదరాబాద్‌

‘మలక్‌పేట కూడలిలోని నల్గొండ క్రాస్‌ రోడ్డు వద్ద ఈ నెల 6న ఉదయం 5 గంటలకే 1,853 వాహనాలు రహదారులపైకి వచ్చాయి. 6 గంటలకు 3,646.. 7 గంటలకు 4,118.. 8 గంటలకు 4,460.. 9 గంటలకు 5,235.. 10 గంటలకు 5,011 వాహనాలు సంచరించాయి. స్థానిక పోలీసులు అప్రమత్తం కావాలి..’ ఇదీ ఇంటిగ్రేటెడ్‌ ట్రాఫిక్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌(సమీకృత ట్రాఫిక్‌ నిర్వహణ వ్యవస్థ) విశ్లేషణ. లాక్‌డౌన్‌ అమలు తీరుతెన్నులపై ఈ వ్యవస్థ గంటలవారీగా వాహనాల సంచారంపై విశ్లేషణ చేస్తూ స్థానిక పోలీసుల్ని అప్రమత్తం చేస్తోంది.
కరోనా కట్టడి నేపథ్యంలో ప్రకటించిన కర్ఫ్యూ, లాక్‌డౌన్‌ అమలు స్థితిగతులపై పోలీస్‌ కంట్రోల్‌రూం ఎప్పటికప్పుడు నిఘా ఉంచుతోంది. పగటిపూటే కాకుండా కర్ఫ్యూ అమల్లో ఉన్న రాత్రివేళల్లోనూ ప్రధాన రహదారులపై వాహనాల సంచారంపై ఆరా తీస్తోంది. ఐటీఎంఎస్‌లోని సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి కంట్రోల్‌రూం సిబ్బంది ఈ పరిస్థితిని అంచనా వేస్తున్నారు. సుమారు కోటి జనాభా కలిగిన జంటనగరాల్లోని వాహనాల సంచారాన్ని నియంత్రించేందుకు ఈ వ్యవస్థ దోహదం చేస్తోంది. హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ కమిషనరేట్ల పరిధిలోని అన్ని ముఖ్య కూడళ్లలో ఏ రోజు ఎన్ని వాహనాలు తిరుగుతున్నాయని విశ్లేషిస్తున్నారు. ఈ సమాచారం ఆధారంగా స్థానిక పోలీసుల్ని అప్రమత్తం చేస్తుండటంతో రద్దీ నియంత్రణ దిశగా వారు చర్యలు తీసుకుంటున్నారు.


కొన్ని మార్గాల్లో వాహనాల సంచారంపై విశ్లేషణ ఇలా..

* మామూలురోజుల్లో సోమవారాలు జంటనగరాల్లో రహదారులపై రద్దీ విపరీతంగా ఉంటుంది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఈ సోమవారం (6వ తేదీ) ద్విచక్రవాహనాల రద్దీ 77 శాతం తగ్గింది. జనతా కర్ఫ్యూ (మార్చి 22) నాటితో చూస్తే మాత్రం 14 శాతం పెరిగింది. కార్ల సంచారం 80 శాతం తగ్గింది. అదే జనతాకర్ఫ్యూతో పోల్చితే మాత్రం 16 శాతం పెరిగింది.
* నల్గొండ క్రాస్‌ రోడ్డు నుంచి దిల్‌సుఖ్‌నగర్‌ వెళ్లే మార్గంలో యశోదా ఆసుపత్రి దాటిన తర్వాత ఎడమవైపు తిరిగి సలీంనగర్‌ మార్గంలో ద్విచక్రవాహనాల సంచారం ఎక్కువగా ఉంది. ట్రాఫిక్‌ పోలీసుల దృష్టి ఉండదనే ఉద్దేశంతో వాహనదారులు ఈ మార్గాన్ని ఎంచుకుంటున్నారు.
* ఎస్‌పీరోడ్డులో రసూల్‌పురా కూడలి నుంచి పంజాగుట్ట వైపు ఉదయం 9-10 గంటల మధ్య ట్రాఫిక్‌ అధికంగా ఉంటోంది. ఆ తర్వాత తగ్గుతోంది.
* పాతబస్తీ ప్రాంతంలో చాలాచోట్ల వాహనాల సంచారం అధికంగా ఉంటోంది.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.