close

ప్రధానాంశాలు

కరోనాపై పోరుకు రూ.7,600 కోట్లు

ట్విటర్‌ సహ వ్యవస్థాపకుడు జాక్‌ డోర్సీ భారీ విరాళం


నా నిర్ణయం మరికొందరికి స్ఫూర్తి కలిగిస్తుందని భావిస్తున్నాను. జీవితం చాలా చిన్నది. కాబట్టి మనం ప్రజలకు చేయగలిగినదంతా ఈ రోజే ఇప్పుడే చేసేద్దాం.

-జాక్‌ డోర్సీ


శాన్‌ఫ్రాన్సిస్కో: కరోనా వ్యాప్తిని నిరోధించే చర్యలకు మద్దతుగా నిలిచేందుకు ట్విటర్‌ సహ వ్యవస్థాపకుడు, ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈవో) జాక్‌ డోర్సీ రూ.7,600 కోట్ల (1 బిలియన్‌ డాలర్ల) భారీ విరాళం ప్రకటించారు. ఈ మేరకు తన డిజిటల్‌ చెల్లింపుల గ్రూప్‌ ‘స్వ్కేర్‌’లో నుంచి ఈక్వీటీ వాటాలను తన సేవా సంస్థ ‘స్టార్ట్‌ స్మాల్‌’కు మళ్లించనున్నట్లు వెల్లడించారు. ఇలా మళ్లించే సుమారు రూ.7,600 కోట్లు (1 బిలియన్‌ డాలర్లు) తన మొత్తం సంపదలో 28% అని చెప్పారు. కరోనాపై పోరుకు ఓ వ్యక్తి వ్యక్తిగతంగా ఇచ్చిన విరాళాల్లో ఇదే అతిపెద్ద మొత్తమని భావిస్తున్నారు. ట్విటర్‌, స్వ్కేర్‌ సంస్థల్లోని షేర్లు సహా డోర్సీ మొత్తం సంపద రూ.22 వేల కోట్లకుపైగా (దాదాపు 3 బిలియన్‌ డాలర్లు) ఉంటుందని అంచనా. మరోవైపు, స్టీవ్‌ జాబ్స్‌ సతీమణి లారెన్‌ పావెల్‌ జాబ్స్‌, హాలీవుడ్‌ నటుడు లినార్డో డికాప్రియోలు స్థాపించిన ఫుడ్‌ ఫండ్‌కు ఇప్పటికే ప్రకటించిన సుమారు రూ.77 లక్షల(లక్ష డాలర్లు)కు సంబంధించిన ఓ పత్రాన్ని డోర్సీ తన ట్వీట్‌లో జతచేశారు. కొవిడ్‌-19 బాధితులకు ఆహారం సమకూర్చేందుకు ఫుడ్‌ ఫండ్‌ పనిచేస్తోంది.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.