close

ప్రధానాంశాలు

అమెరికా వద్ద అత్యాధునిక ఆయుధం

లేజర్‌ పుంజంతో విమానం కూల్చివేత
ఆ దేశ నౌకాదళ ప్రయోగం సఫలం

వాషింగ్టన్‌: గాల్లోనే ఒక విమానాన్ని ధ్వంసం చేసే అత్యంత శక్తిమంతమైన లేజర్‌ ఆయుధాన్ని అమెరికా పరిశోధకులు తయారుచేశారు. దీన్ని విజయవంతంగా ఒక యుద్ధనౌక నుంచి ప్రయోగించినట్లు ఆ దేశ నౌకాదళం ప్రకటించింది. భవిష్యత్‌ యుద్ధ రీతులకు ఈ ప్రయోగం దర్పణం పడుతోంది.
లేజర్‌ వెపన్స్‌ సిస్టమ్‌ డిమోన్‌స్ట్రేటర్‌ (ఎల్‌డబ్ల్యూఎస్‌డీ)లో భాగంగా ఈ ప్రయోగాన్ని చేపట్టారు.

యూఎస్‌ఎస్‌ పోర్ట్‌లాండ్‌ అనే యుద్ధనౌక నుంచి ఈ నెల 16న పరీక్షను నిర్వహించినట్లు అమెరికా నౌకాదళం ఒక ప్రకటనలో పేర్కొంది. గాల్లో ఎగురుతున్న మానవ రహిత విమానాన్ని ఈ లేజర్లు నేలకూల్చాయి. ‘సాలిడ్‌ స్టేట్‌ లేజర్‌’ను ఉపయోగించి ఒక లోహ విహంగాన్ని ధ్వంసం చేయడం ఇదే మొదటిసారి అని పరిశోధకులు తెలిపారు.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.