close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
20 నిమిషాల్లోపే జవాబు రాసే ప్రశ్నలు

రెండు గంటలకు తగ్గట్టుగా ప్రశ్నపత్రం మార్పు
బీటెక్‌/బీఫార్మసీ పరీక్షలపై జేఎన్‌టీయూ మార్గదర్శకాలు

ఈనాడు, హైదరాబాద్‌: బీటెక్‌ పరీక్షల సమయాన్ని రెండు గంటలకే కుదించిన జేఎన్‌టీయూ.. మరో కీలక మార్పు చేసింది. ఒక్కొక్క ప్రశ్నకు 20 నిమిషాల్లోపే సమాధానం రాసేందుకు వీలుగా ప్రశ్నపత్రం ఉంటుందని స్పష్టం చేసింది. ప్రశ్నల్లో ఐచ్ఛికాలు (ఛాయిస్‌) ఎక్కువగా ఇవ్వనుంది. ఈ నెల 20 నుంచి బీటెక్‌/బీఫార్మసీ చివరి ఏడాది సెమిస్టర్‌ పరీక్షలను నిర్వహించేందుకు జేఎన్‌టీయూ సిద్ధమవుతోంది. పరీక్షల విభాగం సంచాలకులు ప్రొ.వి.కామాక్షి ప్రసాద్‌ బుధవారం మార్గదర్శకాలు విడుదల చేశారు.

ప్రతిపాదిత పరీక్షల షెడ్యూలు ఇలా..
* జూన్‌ 20 నుంచి  - బీటెక్‌/బీఫార్మసీ 4-2 సెమిస్టర్‌, ఎంబీఏ/ఎంసీఏ 2-2 సెమిస్టర్‌ రెగ్యులర్‌ పరీక్షలు
* జులై 16 నుంచి - బీటెక్‌/బీఫార్మసీ 1-2, 2-2, 3-2 సెమిస్టర్‌, ఫార్మా-డి 2, 3, 4, 5 సెమిస్టర్‌ పరీక్షలు, ఫార్మా-డి (పీబీ) రెండో ఏడాది పరీక్షలు
* ఆగస్టు 8 నుంచి - బీటెక్‌/బీఫార్మసీ 1-1, 2-1, 3-1, 4-1 సప్లిమెంటరీ, ఎంబీఏ/ఎంసీఏ 1-2 (రెగ్యులర్‌), 1-1, 2-1, 3-1 (ఎంసీఏ) సప్లిమెంటరీ, ఫార్మా-డి మొదటి ఏడాది (రెగ్యులర్‌, సప్లిమెంటరీ)

పరీక్షలలో మార్పులు ఇలా..
* సెమిస్టర్‌ ప్రశ్నపత్రంలో మొత్తం మార్కులపరంగా ఎలాంటి మార్పులు ఉండవు.
* విద్యార్థులకు హాజరు లెక్కింపు రెండు రకాలుగా ఉంటుంది. లాక్‌డౌన్‌ సమయంలో పూర్తి హాజరు ఇవ్వడం, అంతకుముందు జరిగిన తరగతులకు సంబంధించి విద్యార్థులు కళాశాలకు వచ్చిన దాని ప్రకారం హాజరు ఉంటుంది. ఈ రెండింటిని లెక్కించాక డిటెయిన్డ్‌ అయిన విద్యార్థుల వివరాలను కళాశాల ప్రిన్సిపాళ్లకు వర్సిటీ పంపిస్తుంది. ఎవరైనా విద్యార్థులకు అభ్యంతరాలుంటే ప్రిన్సిపాళ్ల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
* 2020-21 విద్యాసంవత్సరానికి క్రెడిట్‌ ఆధారిత డిటెన్షన్‌ ఉండదు. ఈ నిబంధన రెగ్యులర్‌ విద్యార్థులతో పాటు గత విద్యా సంవత్సరంలో డిటెయిన్డ్‌ అయిన విద్యార్థులకూ వర్తిస్తుంది.
* సొంత కళాశాలలోనే పరీక్ష కేంద్రం ఉంటుంది. మూసివేతకు దరఖాస్తు చేసుకున్న కళాశాలలు, ఎక్కువమంది విద్యార్థులు లేనిచోట మాత్రం సమీపంలోని కళాశాలలో సర్దుబాటు చేస్తారు.
* ఒకవేళ ఏవైనా కారణాలతో బీటెక్‌/బీఫార్మసీ ఫైనల్‌ సెమిస్టర్‌ రెగ్యులర్‌ పరీక్షలకు హాజరు కాలేకపోతే.. 45 రోజుల తర్వాత నిర్వహించే అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ రాసే వీలుంటుంది.
* ఎవరైనా విద్యార్థి అనారోగ్యానికి గురైతే ఐసోలేషన్‌ ప్రాంతంలో ఉంచి తగిన చికిత్స అందించాలి.
* విద్యార్థులు బెంచీకి ఒకరు చొప్పున జిగ్‌జాగ్‌ తరహాలో కూర్చోవాలి. రెగ్యులర్‌ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు రోజూ ఒకేచోట కూర్చునేలా ఏర్పాట్లుండాలి.
* జులై 1 నుంచి 15 వరకు కాంటాక్టు తరగతులు నిర్వహించాలి.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.