close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
కరోనాపై సాంకేతిక అస్త్రం

ఆపత్కాలంలో అండగా నిలిచింది
ప్రపంచ ఆర్థిక వేదిక వీడియో సమావేశంలో మంత్రి కేటీఆర్‌

ఈనాడు, హైదరాబాద్‌ : తెలంగాణలో కరోనా నివారణకు సాంకేతిక పరిజ్ఞానం అన్నివిధాలా ఉపయోగపడుతోందని తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీ రామారావు తెలిపారు. ఆపత్కాలంలో ప్రభుత్వాలకు, ప్రజలకు ఆధునిక సాంకేతిక అండగా నిలుస్తోందని అన్నారు. పాలనాపరమైన కార్యక్రమాలు, సేవలకు ఇది ఊతమిస్తోందని చెప్పారు. ప్రపంచ ఆర్థిక వేదిక దక్షిణాసియా ప్రాంతీయ కార్యాచరణ కమిటీ ‘కరోనా నివారణలో నూతన సాంకేతికత పాత్ర’ అనే అంశంపై గురువారం వీడియో సమావేశం నిర్వహించింది.

మంత్రి కేటీఆర్‌తోపాటు ప్రపంచ ఆర్థిక వేదిక అధ్యక్షుడు బోర్జ్‌ బ్రెండె, సింగపూర్‌ ఐటీ, కమ్యూనికేషన్ల మంత్రి ఎస్‌.ఈశ్వరన్‌, బంగ్లాదేశ్‌ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి మహ్మమద్‌ షాహరియర్‌ ఆలమ్‌, మాల్దీవుల అర్థికమంత్రి ఫయాజ్‌ ఇస్మాయిల్‌, పలువురు కీలక నేతలు, వివిధ దేశాల మేధావులు, నిపుణులు, పారిశ్రామికవేత్తలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. ‘‘అపత్కాలంలో సాంకేతికతను వినియోగించుకుని సమస్యలను అధిగమించడంపై దృష్టి సారించాం. ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వంతో పాటు స్థానికంగా జిల్లా అధికారులు, పంచాయతీలతో సంభాషించేందుకు సాంకేతికతను వాడుకుంటున్నాం. పట్టణాల్లో మందుల పిచికారీ కోసం డ్రోన్లను ఉపయోగించాం. వీటి ద్వారా సంప్రదాయ పద్ధతుల్లోకన్న మెరుగ్గా, వేగంగా వైరస్‌ వ్యాప్తిని అరికట్టగలమనే భరోసా ప్రజల్లో కలిగింది. లాక్‌డౌన్‌ కాలంలో ప్రజల కదలికల నియంత్రణల కోసం పోలీసులు డ్రోన్లను ఉపయోగించారు. తెలంగాణ ప్రభుత్వం కరోనాపై ప్రజలకు ఎప్పటికప్పుడు వివరాలు అందించేందుకు ఒక యాప్‌ను, వెబ్‌సైట్‌ను తయారు చేసింది. రేషన్‌ సరకులు అందించేందుకు కూడా ప్రభుత్వం సాంకేతికతను ఉపయోగించింది. ఈ సంక్లిష్ట సమయంలో టెక్నాలజీ అనేక సమస్యలకు పరిష్కారం చూపింది’’ అన్నారు. ఇలాంటి కీలక సమావేశంలో ప్రసంగించేందుకు అవకాశం ఇచ్చిన వేదిక అధ్యక్షునికి కేటీఆర్‌ ధన్యవాదాలు తెలిపారు.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.