close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఆరో స్థానానికి భారత్‌

ఒకే రోజు 9,887 కొత్త కేసులు
294 మరణాలు!

ఈనాడు, దిల్లీ: కరోనా కేసుల్లో భారత్‌ ఇటలీని అధిగమించి, ప్రపంచంలో ఆరో స్థానానికి ఎగబాకింది! ఇప్పటివరకూ ఎన్నడూ లేనంతగా... 24 గంటల్లో దేశవ్యాప్తంగా 9,887 కొత్త కేసులు నమోదుకాగా, 294 మంది మృతి చెందారు. ఈ రెండు అంశాల్లో ఇప్పటివరకూ ఇవే గరిష్ఠం! దేశంలో రికవరీ రేటు శుక్రవారం 48.27% ఉండగా శనివారం నాటికి అది 48.20%కి తగ్గింది. ఇదే సమయంలో మరణాల నిష్పత్తి 2.79% నుంచి 2.80%కి పెరిగింది. శనివారం నాటికి మొత్తం కేసుల సంఖ్య 2.36 లక్షలకు చేరగా, కోలుకున్నవారి సంఖ్య 1.14 లక్షలకు పెరిగింది.
నాలుగు అంకెల సంఖ్యలో కేసులు వచ్చిన రాష్ట్రాలు గత నెలరోజుల్లో రెట్టింపయ్యాయి. గుజరాత్‌, దిల్లీ, తమిళనాడు  అయిదంకెల స్థాయికి చేరాయి. రాజస్థాన్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌లు పదివేల దిశగా వెళ్తున్నాయి. మొత్తం కేసులు, రికవరీలు, మరణాల్లో అన్నింటికంటే మహారాష్ట్ర ముందుంది.

మరణాల సంఖ్యలో గుజరాత్‌ రెండో స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానానికి దిల్లీ చేరుకొంది. 24 గంటల్లో నమోదైన 294 మరణాల్లో 47% (139) మహారాష్ట్రలోనే చోటుచేసుకున్నాయి. మొత్తం 14 రాష్ట్రాల్లో వెయ్యి నుంచి పదివేల లోపు కేసులున్నాయి. ఆరు రాష్ట్రాల్లో 10 వేల నుంచి 80 వేల దాకా నమోదయ్యాయి. ఆరు రాష్ట్రాల్లో 100 నుంచి 700 దాకా మరణాలు సంభవించగా, మహారాష్ట్ర, గుజరాత్‌లలో 2,849, 1,190 మరణాలు నమోదయ్యాయి. గత 24 గంటల్లో మహారాష్ట్ర, తమిళనాడు, దిల్లీలో వెయ్యికిపైగా కేసులు రాగా... 14 రాష్ట్రాల్లో 100 నుంచి 515 వరకూ వచ్చాయి.

మే 15-20 మధ్య రోజుకు 4వేల నుంచి 5వేల కేసులు రాగా, గత మూడు రోజులుగా 10 వేల వరకూ వస్తున్నాయి. కానీ జాతీయ సగటు వృద్ధిరేటు మే 26 నుంచి 5 శాతం దిగువకు పడిపోయింది. గత 12 రోజుల్లో కనిష్ఠంగా 4.28%, గరిష్ఠంగా 4.70% వృద్ధిరేటు కనిపించింది. ఇప్పటివరకూ పరీక్షలు చేయించుకున్నవారిలో 5.23% మందికి పాజిటివ్‌ రాగా, గత 24 గంటల్లో నిర్వహించిన పరీక్షల్లో 7.16% మందికి వైరస్‌ సోకినట్లు తేలింది.

ఈడీ ప్రధాన కార్యాలయంలో ఐదుగురికి..
దిల్లీలోని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) ప్రధాన కార్యాలయంలో ఓ స్పెషల్‌ డైరెక్టర్‌ సహా మొత్తం ఐదుగురు అధికారులకు కరోనా సోకినట్టు శుక్రవారం నిర్ధారణ అయింది. సెక్షన్ల వారీగా ఉద్యోగులకు నిర్వహించిన పరీక్షల్లో ఈ విషయం తేలింది.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.