close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
కొవిడ్‌ మృత్యుహేల

దేశంలో ఒక్కరోజే 507 మరణాలు
మహారాష్ట్రలోనే 245
24 గంటల్లో 18,653 కొత్త కేసులు

ఈనాడు, దిల్లీ: దేశంలో కొవిడ్‌ మహమ్మారి మృత్యు కొరడాను ఝళిపించింది. గతంలో ఎన్నడూలేనివిధంగా తాజాగా ఒక్కరోజులోనే 507 మంది ప్రాణాలను బలి తీసుకుంది. అందులో 245 మరణాలు ఒక్క మహారాష్ట్రలోనివే. మరోవైపు- దేశవ్యాప్తంగా కొత్త కేసులు నిలకడగా పెరుగుతున్నాయి. 24 గంటల్లో 18,653 మంది వైరస్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యారు. అదే సమయంలో 13,157 మంది కోలుకున్నారు. దీంతో నికర కేసుల పెరుగుదల 4,989గా ఉంది. గత పది రోజుల్లో ఆరు రోజులు రికవరీల సంఖ్య 13 వేలకుపైగా నమోదవడం విశేషం.
మహారాష్ట్రలో కొత్త కేసుల ఉద్ధృతి కాస్త తగ్గింది. ఆ రాష్ట్రంలో గత నెల 28న ఏకంగా 6,368 మంది కొవిడ్‌ పాజిటివ్‌గా తేలగా, బుధవారం ఆ సంఖ్య 4,878కి తగ్గింది. దిల్లీలో మంగళవారంతో పోలిస్తే కొత్త కేసుల్లో స్వల్ప పెరుగుదల మాత్రమే కనిపించింది. ఉత్తర్‌ ప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌, గుజరాత్‌లలో రోజువారీ తరహాలోనే 600కుపైగా కేసులొచ్చాయి. కర్ణాటక, ఉత్తర్‌ ప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌లో మరణాలు రోజురోజుకూ పెరుగుతూపోతున్నాయి. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన 17,400 మరణాల్లో 46% ఒక్క మహారాష్ట్రలోనే చోటుచేసుకున్నాయి. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన లెక్కల ప్రకారం.. ఇప్పటివరకు తెలంగాణలో 44.64%, ఆంధ్రప్రదేశ్‌లో 44.61% మంది కోలుకున్నారు.

ముంబయిలో సెక్షన్‌-144
దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో కొవిడ్‌ వ్యాప్తిని అరికట్టేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నగరంలో బుధవారం నుంచి ఈ నెల 15 వరకు సెక్షన్‌-144ను విధిస్తున్నట్లు ప్రకటించింది.

అదుపులోకి పరిస్థితులు: కేజ్రీవాల్‌
దేశ రాజధాని దిల్లీలో ప్రస్తుతానికి పరిస్థితులు అదుపులోకి వచ్చాయని ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ తెలిపారు. కేంద్రం, దిల్లీ ప్రభుత్వం, ఇతర సంస్థలు సంయుక్తంగా చేసిన కృషే ఇందుకు కారణమని చెప్పారు. ఆన్‌లైన్‌లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. దిల్లీలో పరిస్థితులు నెల క్రితం ఊహించినంత భయంకరంగా లేవన్నారు. వాస్తవానికి గత నెల 30 నాటికి రాజధానిలో 60 వేల క్రియాశీల కేసులు ఉంటాయని కేంద్ర ప్రభుత్వ వెబ్‌సైట్‌ గతంలో అంచనా వేసిందని, అందుకు భిన్నంగా ప్రస్తుతం కేవలం 26 వేల క్రియాశీల కేసులున్నాయని పేర్కొన్నారు.
59.43% దేశంలో రికవరీ రేటు
2.97% మరణాల రేటు

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.