close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
అప్పుల కుంపట్లో తెలుగు రాష్ట్రాలు

తెలంగాణలో 38%, ఏపీలో 42%
తెలంగాణ 9 నుంచి 6వ స్థానానికి...
ఏపీ 6 నుంచి మూడో స్థానానికి..

ఈనాడు, దిల్లీ: అప్పులు తీసుకోవడంలో తెలుగురాష్ట్రాలు పోటీపడుతున్నాయి. గతేడాదితో పోలిస్తే తెలంగాణలో అప్పుల భారం 38 శాతం పెరగ్గా, ఆంధ్రప్రదేశ్‌లో 42 శాతం పెరిగింది. గత సంవత్సరం దేశంలో తొమ్మిదో స్థానంలో ఉన్న తెలంగాణ ఈ ఏడాది ఆరోస్థానం పొందగా, ఏపీ ఆరోస్థానం నుంచి మూడో స్థానానికి ఎగబాకింది. సోమవారం రిజర్వుబ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా విడుదల చేసిన బులిటెన్‌ ఈ వివరాల్ని వెల్లడించింది.

తెలంగాణలో ఇలా...
తెలంగాణ రాష్ట్రం 2018-19లో బహిరంగ మార్కెట్‌ నుంచి స్థూలంగా రూ.26,740 కోట్లు, నికరంగా రూ.22,183 కోట్ల రుణం సేకరించింది. 2019-20 కల్లా స్థూల రుణం రూ.37,109 కోట్లు, నికరరుణం రూ.30,697 కోట్లకు చేరింది. దీన్నిబట్టి ఏడాది కాలంలో స్థూలరుణం 38.77%, నికర రుణం 38.38% పెరిగింది. గత ఏడాది దేశంలో బహిరంగమార్కెట్‌ నుంచి అత్యధిక రుణం సేకరించిన 9వ రాష్ట్రంగా నిలిచింది. 2020-21 సంవత్సరంలో ఏప్రిల్‌, మేనెలల్లో తెలంగాణ రాష్ట్రం స్థూలంగా రూ.8వేల కోట్లు, నికరంగా రూ.6,750 కోట్ల మేర సేకరించింది. ఈ విషయంలో రాష్ట్రం 6వ స్థానాన్ని ఆక్రమించింది. ఈ ఏడాది ఇప్పటివరకు తీసుకున్నదాన్నిబట్టి చూస్తే మొత్తం ఆర్థిక సంవత్సరంలో స్థూలరుణం రూ.48వేల కోట్లకు, నికర రుణం రూ.40,500కోట్లకు చేరే అవకాశం ఉంటుంది.

ఆంధ్రప్రదేశ్‌ లెక్క ఇదీ!
2018-19తో పోలిస్తే 2019-20లో బహిరంగ మార్కెట్‌ నుంచి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సేకరించిన స్థూల రుణం 42.10%, నికర రుణం 42.47%మేర పెరిగింది.   2020-21 మార్చి, ఏప్రిల్‌, మే నెలల్లో నెలకు సగటున రూ.3,333 కోట్ల చొప్పున రూ.10వేల కోట్ల స్థూల రుణం తీసుకొంది. ఇందులో నికర రుణవాటా రూ.8,250 కోట్లుగా ఉన్నట్లు ఆర్‌బీఐ వెల్లడించింది. గత ఏడాది అత్యధిక రుణాలు తీసుకున్న రాష్ట్రంగా ఆరోస్థానం ఆక్రమించిన ఆంధ్రప్రదేశ్‌ 2020-21లో ఇప్పటివరకు ఉన్న లెక్కల ప్రకారం మూడో స్థానంలో నిలిచింది.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.