close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
మరిన్ని ఐసీయూ పడకలు

ప్రైవేటు బోధనాసుపత్రుల్లో  1,000 అందుబాటులోకి
కొవిడ్‌కు మొత్తం11,950 కేటాయింపు
హైకోర్టుకు వైద్యఆరోగ్యశాఖ నివేదిక

ఈనాడు, హైదరాబాద్‌: కరోనా బాధితులకు చికిత్స అందించడంలో ప్రభుత్వ వైద్యానికి తోడుగా ప్రైవేటు బోధనాసుపత్రుల్లోనూ 11,950 పడకలు అందుబాటులో ఉన్నాయని ఆరోగ్యశాఖ తెలిపింది. ఇందులో 1,000 ఐసీయూ పడకలు కూడా ఉన్నట్లు పేర్కొంది. ఈ మేరకు సోమవారం హైకోర్టుకు వైద్యఆరోగ్యశాఖ సమగ్ర నివేదికను సమర్పించింది.
* ప్రభుత్వ ఆసుపత్రుల్లో కొవిడ్‌ బాధితుల కోసం 5,131 పడకలున్నాయి. వీటిల్లో ఐసీయూ పడకలు 361, వెంటిలేటర్లతో కూడిన ఐసీయూ పడకలు 255 ఉండగా, 2,339 పడకలకు ఆక్సిజన్‌ సరఫరాను కూడా సమకూర్చారు. మిగిలినవి ఐసొలేషన్‌ పడకలు.
* వీటికి అదనంగా ప్రైవేటు బోధనాసుపత్రుల్లోని పడకలను కూడా ప్రభుత్వ పర్యవేక్షణలోకి తీసుకువస్తారు.
* తొలిదశలో హైదరాబాద్‌లోని అపోలో, కామినేని, మల్లారెడ్డి (మహిళ), మమత, షాదన్‌ వైద్యకళాశాలలకు అనుబంధంగా ఉన్న బోధనాసుపత్రులు, కరీంనగర్‌లోని చల్మెడ ఆనందరావు, ప్రతిమ, మెదక్‌లోని ఆర్‌వీఎం,  రంగారెడ్డిలోని భాస్కర, మల్లారెడ్డి, మెడిసిటీ, మహావీర్‌, పట్నం మహేందర్‌రెడ్డి, వీఆర్‌కే, అయాన్‌ బోధనాసుపత్రుల్లోని 8,315 పడకలను వినియోగిస్తారు.
* వీటిల్లో 548 ఐసీయూ పడకలు, 167 వెంటిలేటర్లతో కూడిన ఐసీయూ పడకలున్నాయి. 788 పడకలకు ఆక్సిజన్‌ సరఫరా అందుబాటులో ఉంది.
* కరోనా తీవ్రత పెరిగితే రెండోదశలో ఖమ్మంలోని మమత, మెదక్‌లోని ఎంఆన్‌ఆర్‌, మహేశ్వర, నల్గొండలోని కామినేని, సిద్దిపేటలోని సురభి, మహబూబ్‌నగర్‌లోని ఎస్‌వీఎస్‌ వైద్యకళాశాలలకు అనుబంధంగా ఉన్న బోధనాసుపత్రులను కొవిడ్‌ బాధితుల కోసం అందుబాటులోకి తీసుకొస్తారు.
* రెండోదశ ఆసుపత్రుల్లో 3,635 పడకలు అందుబాటులోకి వస్తాయి. ఇందులో 236 ఐసీయూ పడకలు, 49 వెంటిలేటర్లతో కూడిన ఐసీయూ పడకలున్నాయి. 410 పడకలకు ఆక్సిజన్‌ అందుబాటులో ఉంది.
* ప్రభుత్వ పర్యవేక్షణలో చికిత్స అందించే ఈ 21 ప్రైవేటు బోధనాసుపత్రులకూ కరోనా సేవలకు అవసరమయ్యే ఔషధాలు, పీపీఈ కిట్లు, మాస్కులు, గ్లౌజులు, ఇతరత్రాలను తెలంగాణ రాష్ట్ర వైద్యసేవలు మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ ద్వారా వాటికి ఉచితంగా అందజేస్తారు.
* ప్రైవేటు బోధనాసుపత్రులకు సరఫరా చేసే ఔషధాలు, ఇతర వస్తువుల వినియోగంపై నిరంతర పర్యవేక్షణకు ఒక ఉన్నతాధికారిని నియమించారు.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.