close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
రాష్ట్ర కమలదళానికి కొత్త కమిటీ

మాజీ ఎమ్మెల్యేలకు ప్రాధాన్యం
ప్రధాన కార్యదర్శిగా బంగారు శృతి
పలువురు కొత్త వారికి చోటు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర భాజపా ఆదివారం నూతన కమిటీని ప్రకటించింది. పార్టీని ప్రత్యామ్నాయ శక్తిగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర కమిటీ, అనుబంధ విభాగాలు దోహదం చేస్తాయని.. మరికొన్ని కమిటీలను త్వరలో ప్రకటిస్తామని ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ వెల్లడించారు. కొత్త కమిటీలో మాజీ ఎమ్మెల్యేలకు ప్రాధాన్యం లభించింది. రానున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పలువురు గ్రేటర్‌ నేతలకు కమిటీలో చోటు కల్పించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ నుంచి వచ్చిన జి.విజయరామారావు, కుంజా సత్యవతి.. తెదేపా నుంచి వచ్చిన బండారు శోభారాణి, పి.రజనీకుమారి, ఎం.శ్రీనివాస్‌గౌడ్‌... యన్నం శ్రీనివాస్‌రెడ్డి రాష్ట్ర కమిటీలో పదవులు దక్కించుకున్నవారిలో ఉన్నారు. ఉపాధ్యక్షుల్లో సంకినేని వెంకటేశ్వర్‌రావు, ప్రధాన కార్యదర్శుల్లో ప్రేమేందర్‌రెడ్డి మాత్రమే తిరిగి చోటు దక్కించుకున్నారు. భాజపా జాతీయ మాజీ అధ్యక్షుడు, దివంగత బంగారు లక్ష్మణ్‌ కుమార్తె శృతికి కీలకమైన ప్రధాన కార్యదర్శి పదవి లభించింది. 2014 ఎన్నికల సమయంలో లోక్‌సత్తా నుంచి భాజపాలో చేరిన గీతామూర్తి అనూహ్యంగా మహిళామోర్చా రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు దక్కించుకున్నారు. కార్యాలయ కార్యదర్శిగా ఉమాశంకర్‌ నియమితులయ్యారు. పదవులు దక్కని కొందరు ఆశావహులు అసంతృప్తిగా ఉన్నారు. అయితే రాష్ట్ర కోర్‌ కమిటీ, కొత్తగా ఏర్పాటుచేయనున్న రెండు ప్రత్యేక కమిటీలు, జాతీయ కార్యవర్గంలో సీనియర్‌ నేతలకు అవకాశాలు ఉంటాయని ఓ ముఖ్యనేత చెప్పారు.

పదవుల కుదింపు
పాత కమిటీలో ఉపాధ్యక్షులు, కార్యదర్శులు పది మంది చొప్పున ఉండగా.. తాజాగా 8, 8 మందికి తగ్గించారు. ప్రధాన కార్యదర్శులను నలుగురి నుంచి ముగ్గురికి తగ్గించారు. పార్టీ రాజ్యాంగం ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర అధికార ప్రతినిధులు గతంలో 12 మంది ఉండగా.. ప్రస్తుతం ముగ్గురినే ప్రకటించారు.

నూతన ఉపాధ్యక్షులు
జి.విజయరామారావు, చింతల రామచంద్రారెడ్డి, సంకినేని వెంకటేశ్వర్‌రావు, యండల లక్ష్మీనారాయణ, ఎన్వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌, యన్నం శ్రీనివాస్‌రెడ్డి, జి.మనోహర్‌రెడ్డి, బండ్రు శోభారాణి. బీ వీరిలో మనోహర్‌రెడ్డి, శోభారాణి మినహా మిగిలిన ఆరుగురు మాజీ ఎమ్మెల్యేలు

మోర్చాల రాష్ట్ర అధ్యక్షులు
యువ మోర్చా: ఎ.భానుప్రకాశ్‌; మహిళా మోర్చా: కె.గీతామూర్తి; కిసాన్‌ మోర్చా: కొండపల్లి శ్రీధర్‌రెడ్డి; ఎస్సీ మోర్చా: కొప్పు బాషా; ఎస్టీ మోర్చా: హుస్సేన్‌నాయక్‌; ఓబీసీ మోర్చా: ఆలె భాస్కర్‌; మైనార్టీ మోర్చా: అఫ్సర్‌పాషా


భాజపా నూతన కార్యవర్గంపై రాజాసింగ్‌ అసంతృప్తి

గోషామహల్‌, న్యూస్‌టుడే: భాజపా రాష్ట్ర నూతన కార్యవర్గం ఎంపికపై ఆ పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మేరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు ఆదివారం వాట్సప్‌ సందేశం పంపారు. ఆ సందేశాన్ని మీడియాకు విడుదల చేశారు. ‘‘తెలంగాణలో భాజపాకు ఏకైక ఎమ్మెల్యే అయిన నన్ను సంప్రదించలేదు. రెండు సార్లు భారీ మెజారిటీతో నన్ను గెలిపించిన గోషామహల్‌ నియోజకవర్గంలో ఏ ఒక్క నాయకునికి కమిటీలో చోటు కల్పించలేదు. పార్టీ జెండా పట్టుకొని నిరంతరం పనిచేసిన కార్యకర్తలకు ఇచ్చే గుర్తింపు ఇదేనా? అయినప్పటికీ రాష్ట్రంలో పార్టీ బలోపేతం కోసం మీ నాయకత్వంలో పని చేసేందుకు సిద్ధంగా ఉన్నాను’’ అని రాజాసింగ్‌ పేర్కొన్నారు.

ప్రధాన కార్యదర్శులు
జి.ప్రేమేందర్‌రెడ్డి, దు గ్యాల ప్రదీప్‌కుమార్‌, బంగారు శృతి, మంత్రి శ్రీనివాసులు (సంస్థాగత వ్యవహారాలు)

కార్యదర్శులు
రఘునందన్‌రావు, డాక్టర్‌ ప్రకాశ్‌రెడ్డి, ఎం.శ్రీనివాస్‌గౌడ్‌, బొమ్మ జయశ్రీ, పల్లె గంగారెడ్డి, కుంజా సత్యవతి (మాజీ ఎమ్మెల్యే), కె.మాధవి, జి.ఉమారాణి

అధికార ప్రతినిధులు
కృష్ణసాగర్‌రావు, పి.రజనీకుమారి, ఏ.రాకేశ్‌రెడ్డి

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.