close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
కోలుకున్నవారు 51వేల మంది

ఒక్కరోజులో ఇదే గరిష్ఠం
24 గంటల్లో 853 మంది మృతి
35.66% కేసులు దక్షిణాది రాష్ట్రాలవే

ఈనాడు, దిల్లీ: కరోనా కోణంలో చీకటి వెలుగులు కనిపించాయి. గత ఒక్క రోజులో ఇదివరకు ఎన్నడూ లేనంతగా ఒకేరోజు 853 మంది మరణించారు. చనిపోయిన కేసులు 800 మార్కు దాటడం ఇదే తొలిసారి. మరోవైపు ఇదివరకు ఎన్నడూలేనంత గరిష్ఠ స్థాయిలో 51,255 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకూ జులై 31న గరిష్ఠంగా 37వేల మంది కోలుకోగా, ఇప్పుడు తొలిసారి అది 50వేల మార్కును దాటింది. ఇందులో అత్యధికంగా ఆంధ్రప్రదేశ్‌ నుంచి 12,750 మంది, మహారాష్ట్రలో 10,725, తమిళనాడులో 7,010 మంది కోలుకున్నారు. తొలిసారి టాప్‌-4 రాష్ట్రాలన్నింటిలోనూ కొత్త కేసులకంటే కోలుకున్నవారి సంఖ్యే అధికంగా నమోదైంది. ఫలితంగా ఈ రాష్ట్రాల్లో యాక్టివ్‌కేసుల సంఖ్య 6,208 మేర తగ్గింది. దీనివల్ల దేశవ్యాప్తంగా ఇదివరకు ఎన్నడూలేని విధంగా క్రియాశీలక కేసులు 24 గంటల్లో కేవలం 2,627 మాత్రమే పెరిగాయి.

మూడు నగరాల్లో తగ్గుతున్న సంక్రమణం
దిల్లీలో నిరంతరం కేసులు తగ్గుతున్నాయి. ముంబయి, చెన్నైల్లోనూ సంక్రమణ వేగం తగ్గుతున్నట్టు నిపుణులు పేర్కొన్నారు. ఒకరి ద్వారా మరొకరికి వైరస్‌ సంక్రమించే వేగం(ఆర్‌- ఫ్యాక్టర్‌) దిల్లీలో 0.66, ముంబయిలో 0.81, చెన్నైలో 0.86కి చేరినట్లు చెన్నైలోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేథమెటికల్‌ సైన్సెస్‌ జరిపిన అధ్యయనంలో తేలింది. దేశంలో సగటున ఒక వ్యక్తి నుంచి 1.16 మందికి వైరస్‌ సోకుతుంటే ఈ మూడునగరాల్లో మాత్రం ఒకరికిలోపే ఉంది. ఇది అన్నింటికంటే అధికంగా ఆంధ్రప్రదేశ్‌లో 1.48మేర ఉన్నట్లు తేలింది. దిల్లీలో సక్రమణ వేగం తగ్గడం స్థిరంగా కొనసాగుతున్నప్పటికీ, మిగిలిన రెండునగరాల్లో అది ఇప్పుడిప్పుడే ప్రారంభమైంది. తాజా లెక్కల ప్రకారం దేశంలో కోలుకున్నవారి శాతం 65.43కి, మరణాల శాతం 2.13కి చేరింది. మొత్తం పరీక్షలు 1.98 కోట్లకు చేరాయి. మరో రోజులో ఇవి రెండు కోట్లను దాటనున్నాయి.

మహారాష్ట్రలో మరణ మృదంగం
మహారాష్ట్రలో ఎన్నడూ లేని విధంగా ఒకేరోజు 322 మరణాలు సంభవించాయి. గత ఒక్కరోజులో చోటుచేసుకున్న మరణాల్లో ఆ రాష్ట్ర వాటా 38% ఉంది. తమిళనాడు, ఏపీ, దిల్లీ, కర్ణాటకలను కలిపితే ఆ వాటా 70% చేరింది. రోజువారీ కేసుల పెరుగుదలలో మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌ తొలి రెండు స్థానాల్లో నిలిచాయి. ఆతర్వాతి స్థానాలను తమిళనాడు, కర్ణాటకలు ఆక్రమించాయి. టాప్‌-5లో మూడు దక్షిణాది రాష్ట్రాలు ఉండటం అక్కడి ప్రమాద తీవ్రతకు అద్దం పడుతోంది. దేశంలోని మొత్తం కేసుల్లో 6,24,368 (35.66%) ఆరు దక్షిణాది రాష్ట్రాల నుంచి వచ్చాయి.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.