close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
భూములివ్వడమే మా తప్పా?

రాజధాని గ్రామాల్లో కొనసాగిన ఆందోళనలు

ఈనాడు- అమరావతి, న్యూస్‌టుడే- తుళ్లూరు, తుళ్లూరు గ్రామీణం:  ఏపీ రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతిని ప్రకటించి, అభివృద్ధి చేసే వరకు ఉద్యమం ఆగదని రైతులు, రైతు కూలీలు స్పష్టం చేశారు. రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులకు నిరసనగా ఆదివారం అమరావతి గ్రామాల్లో ఆందోళనలు కొనసాగాయి. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ.. దీక్షా శిబిరాల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిరసనలు చేపట్టారు. అమరావతిని కాపాడుకుందామని రైతులు పిలుపునిచ్చారు. జనసేన పార్టీ తన వైఖరిని బయటపెట్టాలన్నారు. పాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లుల ఆమోదం భాజపా కన్నుసన్నల్లోనే నడిచాయని ఆరోపించారు. భూములు ఇవ్వడమే మేం చేసిన తప్పా అని ప్రశ్నించారు. ప్రధాని మోదీ జోక్యం చేసుకొని రైతులకు న్యాయం చేయాలని కోరారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా చేయాలని నిడమర్రులో రైతులు డిమాండ్‌ చేశారు. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తుళ్లూరు, వెలగపూడిలోని శిబిరాలను సందర్శించి సంఘీభావం తెలిపారు. రాజధానిని ఎవరూ అంగుళం కూడా కదల్చలేరని, న్యాయస్థానాలు అమరావతికి రక్షణ కవచంగా ఉంటాయని వివరించారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.