close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
నీటిపారుదల శాఖలో ‘కొత్తనీరు’

మరో 576 ఏఈఈ, ఏఈ పోస్టుల భర్తీ
భూముల బాధ్యత మరో ఈఎన్‌సీకి
పునర్‌ వ్యవస్థీకరణ తర్వాత జలవనరుల శాఖ రూపు ఇదే!

ఈనాడు, హైదరాబాద్‌: పునర్‌ వ్యవస్థీకరణతో సాగునీటిపారుదలశాఖకు మరింత యువశక్తి తోడుకానుంది. దాదాపు 576 సహాయ కార్యనిర్వాహక ఇంజినీర్లు/సహాయ ఇంజినీర్ల (ఏఈఈ/ఏఈ) పోస్టులను ప్రత్యక్ష నియామకాల ద్వారా భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రంలో ప్రాజెక్టుల కింద ఆయకట్టు పెరుగుతుండటంతో చివరి ఎకరా వరకూ నీటిని అందించేలా శాఖను పునర్‌ వ్యవస్థీకరిస్తున్నారు. జలవనరుల శాఖగా పేరు మార్చనున్నారు. ప్రాజెక్టుల పరిధిని విభజించి సులువుగా నిర్వహణ ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇలా భారీ కసరత్తు అనంతరం శాఖ ముసాయిదాకు తుది రూపు ఇచ్చింది. కొద్ది రోజుల్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు దీన్ని సమర్పించనున్నారు. ఆయన ఆమోదం అనంతరం కొత్తపేరుతో పరిపాలన సేవలు ప్రారంభం కానున్నాయి. విశ్వసనీయ సమాచారం మేరకు ముసాయిదాలోని వివరాలు ఇలా.. ఎత్తిపోతలతోనే సాగునీటి వినియోగం ఉన్నందున దాని నిర్వహణకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నారు. భారీ, మధ్య తరహా, చిన్న తరహా, నీటిపారుదల అభివృద్ధి సంస్థలను విలీనం చేసి ఆయకట్టు, ప్రాజెక్టుల పరిధి మేరకు సీఈలను నియమించనున్నారు.
* ఇప్పుడున్న ఐదుగురు ఈఎన్‌సీలలో హైదరాబాద్‌ కేంద్రంగా జనరల్‌, పరిపాలన విభాగాలకు ఇద్దరిని కొనసాగిస్తారు.
* ఆపరేషన్స్‌ - నిర్వహణ విభాగం పేరుతో కొత్త ఈఎన్‌సీ పోస్టును ఏర్పాటు చేస్తారు.
* జిల్లాల్లో ఇప్పుడున్న మూడు ఈఎన్‌సీ స్థానాలను (సీఈ పోస్టుల స్థానం) కొనసాగించనున్నారు.
* మంచిర్యాల, జగిత్యాల, రామగుండం, ములుగు, సంగారెడ్డి, గజ్వేల్‌, సూర్యాపేట, వనపర్తి, నాగర్‌కర్నూలు, రంగారెడ్డి-హైదరాబాద్‌ స్థానాల్లోనూ సీఈలు పర్యవేక్షణ చేయనున్నారు. ఎలక్ట్రో మెకానికల్‌ సీఈలను కరీంనగర్‌, హైదరాబాద్‌లలో నియమించనున్నారు. మొత్తం 29 మంది సీఈల ద్వారా శాఖ పర్యవేక్షణ కొనసాగనుంది.

భూముల నిర్వహణ అధికారం కొత్త ఈఎన్‌సీకి
శాఖ పరిధిలో 12.60 లక్షల ఎకరాల భూములు ఉన్నాయి. వీటి పర్యవేక్షణ, పరిరక్షణ బాధ్యతను కొత్తగా నియమించనున్న ఆపరేషన్స్‌ - నిర్వహణ విభాగం ఈఎన్‌సీకి అప్పగించనున్నారు. దీంతోపాటు పలు ప్రాధాన్య విధులు ఉండనున్నాయి.

భారీగా పదోన్నతులకు అవకాశం
శాఖాపరమైన పదోన్నతుల ద్వారా దిగువ కేడర్‌కు పై స్థాయి పదోన్నతులు దక్కనున్నాయి. పునర్‌వ్యవస్థీకరణతో శాఖలో సహాయ కార్యనిర్వాహక ఇంజినీర్లు/ సహాయ ఇంజినీర్ల స్థాయి నుంచి ఈఎన్‌సీ వరకు అదనపు పోస్టులు అవసరమని గుర్తించారు. ఏఈఈ, ఏఈ పోస్టులు 576 నేరుగా భర్తీ చేస్తారు. ఉప కార్యనిర్వాహక ఇంజినీర్ల నుంచి ఈఎన్‌సీ వరకు ఉన్న సిబ్బందికి పదోన్నతులు కల్పించి భర్తీ చేయాలని భావిస్తున్నారు.

పదోన్నతులతో ఏర్పడనున్న అదనపు పోస్టులు
ఉప కార్యనిర్వాహక ఇంజినీర్లు (డీఈఈ) - 144
కార్యనిర్వాహక ఇంజినీర్లు (ఈఈ) - 36
పర్యవేక్షక ఇంజినీర్లు (ఎస్‌ఈ) - 12
ముఖ్య ఇంజినీర్లు (సీఈ) - 5
ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ (ఈఎన్‌సీ) - 1

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.