close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ప్రైవేటు ఆసుపత్రుల వైఖరేమిటి?

ఈ సమయంలోనూ అధిక ఫీజులా?
షరతులు ఉల్లంఘిస్తే భూములను ఎందుకు వెనక్కి తీసుకోరు?
కౌంటరు దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
అపోలో, బసవతారకం ఆస్పత్రులపై ప్రజాప్రయోజన వ్యాజ్యం

ఈనాడు, హైదరాబాద్‌: వైద్యం అందించడంలో ప్రైవేటు ఆసుపత్రుల వైఖరి ఏమిటో అర్థం కావడంలేదని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కొవిడ్‌ విజృంభిస్తున్న ఈ పరిస్థితుల్లోనూ అధిక ఫీజులు వసూలు చేస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తోందని వ్యాఖ్యానించింది. పేదలకు వైద్యం అందించడానికి ఆసుపత్రులు ఎందుకు నిరాకరిస్తున్నాయని ప్రశ్నించింది. ఇలాంటి వాటిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. షరతులతో భూమిని తీసుకున్న ఆసుపత్రులు వాటిని ఉల్లంఘిస్తే .. కేటాయించిన భూమిని ఎందుకు స్వాధీనం చేసుకోరాదో చెప్పాలంటూ విచారణను ఈ నెల 13వ తేదీకి వాయిదా వేసింది. హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రి, బసవ తారకం ఇండో అమెరికన్‌ క్యాన్సర్‌ హాస్పిటల్‌ అండ్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌కు భూకేటాయింపుల సమయంలో పెట్టిన షరతులను ఉల్లంఘించడాన్ని సవాలు చేస్తూ సామాజిక కార్యకర్త ఓ.ఎం.దేబరా హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌.ఎస్‌.చౌహాన్‌, జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. 1981, 1989లలో జారీ చేసిన జీవోల కింద కొన్ని షరతులతో ఈ ఆసుపత్రులకు భూములు కేటాయించారని పిటిషన్‌లో పేర్కొన్నారు. అపోలో ఆసుపత్రికి (డెక్కన్‌ హాస్పిటల్స్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌) 30 ఎకరాల భూమిని కేటాయించడంతో పాటు యూఎల్‌సీ మినహాయింపునిస్తూ పేద రోగులకు 15 శాతం పడకలు కేటాయించాలన్న షరతును ప్రభుత్వం విధించిందన్నారు. ప్రస్తుతం ఆ భూమి మార్కెట్‌ విలువ రూ.1500 కోట్లు ఉంటుందన్నారు. ఆసుపత్రిలో పేదలకు ఎలాంటి పడకలనూ రిజర్వు చేయడంలేదని చెప్పారు. బసవతారకం ఆసుపత్రికి 1989లో 7.35 ఎకరాల భూమిని 30 ఏళ్ల లీజుకిచ్చి మరో 30 ఏళ్లకు పొడిగించుకునేలా ప్రభుత్వం ఆదేశాలిచ్చిందని, ఇందులో 25 శాతం పడకలను పేదలకు ఉచితంగా కేటాయించాలని, 40 శాతం ఔట్‌పేషెంట్లకు ఉచితంగా వైద్యం అందించాల్సి ఉందని, ఈ భూమి విలువ ప్రస్తుతం రూ.400 కోట్లు ఉంటుందన్నారు. కొవిడ్‌ తీవ్రంగా ఉన్న సమయంలో 50 శాతం పడకలను కేటాయించేలా ఆదేశించాలని కోరారు. అపోలో ఆసుపత్రిని కొవిడ్‌ చికిత్సలకు ప్రభుత్వం అనుమతించిందని, అక్కడ రోజుకు రూ. లక్ష వరకూ వసూలు చేస్తున్నట్లు తెలుస్తోందన్నారు. పిటిషనర్‌ తరఫు న్యాయవాది గండ్ర మోహన్‌రావు వాదనలు వినిపిస్తూ ఆసుపత్రులు నిబంధనలను ఉల్లంఘిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదన్నారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ ఆసుపత్రులు కొవిడ్‌ కష్ట సమయంలోనూ చికిత్సలు అందించడంలేదంది. సొమ్ము చెల్లించే వరకూ మృతదేహాన్ని అప్పగించలేదన్న విషయాన్ని ఉదయం పత్రికల్లో చూశామంది.  .పూర్తి వివరాలతో కౌంటరు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ వాయిదా వేసింది.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.