close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
2 వేలకుపైగా కేసులు

గత 5 రోజుల్లో ఇది రెండోసారి
మహమ్మారితో 13 మంది మృతి
71 వేలకు చేరువలో బాధితులు
50 వేలు దాటిన కోలుకున్నవారి సంఖ్య

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా వైరస్‌ కేసులు మంగళవారం 2,012 నమోదయ్యాయి. ఒక్క రోజులో 2 వేలకు పైగా కేసులు రావడం గత 5 రోజుల్లో ఇది రెండోసారి. గత నెల 31న తొలిసారి అత్యధికంగా 2,083 పాజిటివ్‌లు నమోదైన విషయం తెలిసిందే. మంగళవారం రాత్రి 8 గంటల వరకూ నమోదైన కరోనా సమాచారాన్ని వైద్యఆరోగ్యశాఖ బుధవారం విడుదల చేసింది. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 70,958కి చేరింది. మంగళవారం అత్యధికంగా జీహెచ్‌ఎంసీ(హైదరాబాద్‌) పరిధిలో 532 కేసులు, ఆ తర్వాత మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాలో 198, రంగారెడ్డి 188, వరంగల్‌ నగర 127, ఖమ్మం 97, సంగారెడ్డి 89, నిజామాబాద్‌ 83, కామారెడ్డి 75, భద్రాద్రి కొత్తగూడెం 52, మహబూబ్‌నగర్‌ 51, నల్గొండ 49, జోగులాంబ గద్వాల 48, జయశంకర్‌ భూపాలపల్లి 46, కరీంనగర్‌ 41, పెద్దపల్లి 41, మహబూబాబాద్‌ 36, సిద్దిపేట 28, వరంగల్‌ గ్రామీణ 28, సూర్యాపేట 27, జగిత్యాల 27, యాదాద్రి భువనగిరి 26, మెదక్‌ 21, వనపర్తి జిల్లాలో 20 కేసులు నమోదయ్యాయి. మిగిలిన 10 జిల్లాల్లో స్వల్ప సంఖ్యలో పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి.
కోలుకున్న వారు: రాష్ట్రంలో మంగళవారం 1,139 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకూ కొవిడ్‌ బారినపడి కోలుకున్నవారి సంఖ్య 50,814 (71.6శాతం)కి చేరింది. జాతీయస్థాయిలో కోలుకున్న వారి సగటు 66.31శాతంగా ఉంది.
మరణాలు: మహమ్మారికి చిక్కిన వారిలో కొత్తగా 13 మంది మృత్యువాతపడ్డారు. దీంతో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 576కు పెరిగింది. మొత్తం కేసుల్లో మరణాలు 0.81శాతం కాగా, జాతీయస్థాయి సగటు 2.10శాతంగా ఉంది.
చికిత్సలు: ప్రస్తుతం కరోనా బాధితుల్లో 19,568 మంది చికిత్స పొందుతున్నారు. వీరిలో 12,938 మంది ఆసుపత్రుల్లోని ఐసొలేషన్‌లో, ఇళ్లలో చికిత్స పొందుతున్నారు. హోం ఐసొలేషన్‌లో ఉన్నవారిలో 84 శాతం మందిలో ఎటువంటి లక్షణాలు లేవని నివేదికలో వెల్లడించారు.
పరీక్షలు: మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా 21,118 నమూనాలను పరీక్షించారు. ఇప్పటివరకూ ఒక్కరోజులో చేసిన అత్యధిక పరీక్షలు ఇవే. మొత్తం పరీక్షల సంఖ్య 5,22,143కు చేరింది. ఇంకా 1,167 నమూనాల ఫలితాలు వెల్లడవ్వాల్సి ఉంది.
పడకలు: ప్రభుత్వవైద్యంలో మంగళవారం నాటికి 2,578 పడకల్లో రోగులు వైద్యం పొందుతున్నారు. 5,858 పడకలు అందుబాటులో ఉన్నాయి. ప్రైవేటు ఆసుపత్రుల్లో 4,052 పడకలు నిండిపోగా, 2,569 పడకలు ఖాళీగా ఉన్నాయి.


21-40 ఏళ్ల వారే ఎక్కువ

మొత్తం కేసుల్లో పురుషులు 65.6శాతం, మహిళలు 34.4శాతం ఉన్నారు. బాధితుల్లో 47.1శాతం మంది 21-40 ఏళ్ల మధ్య వారే కావడం గమనార్హం. బాధితుల్లో 3.2శాతం మంది 71 ఏళ్ల పైబడిన వారు. మరణాల్లో కేవలం కొవిడ్‌ కారణంగా మృతి చెందినవారు 46.13శాతం కాగా, కరోనాతో పాటు ఇతర దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు 53.87శాతం ఉన్నారు.


ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.