close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
లోయలో పడ్డ విమానం

పైలట్‌, కోపైలట్‌ సహా 19 మంది దుర్మరణం
100 మందికి పైగా గాయాలు
కొజికోడ్‌ రన్‌వేపై ఘోర ప్రమాదం
దుబాయి నుంచి వచ్చిన వందే భారత్‌ విమానం
అదుపుతప్పి పక్కనున్న లోయలోకి..

కొజికోడ్‌: కేరళలోని కొజికోడ్‌లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. గమ్యస్థానానికి చేరుకున్న ‘ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌’ విమానం అనూహ్యంగా అదుపుతప్పి, 35 అడుగుల లోయలో పడింది. ఇందులో 19 మంది చనిపోగా 100 మందికి పైగా గాయపడ్డారు. ఇద్దరు పైలట్లు, ఐదుగురు క్యాబిన్‌ సిబ్బంది, పది మంది చిన్నారులు సహా 174 మంది ప్రయాణికులతో దుబాయ్‌ నుంచి వచ్చిన బోయింగ్‌ 737 (ఫ్లైట్‌ ఐఎక్స్‌ 1344) విమానం శుక్రవారం రాత్రి 7.41 గంటలకు కొజికోడ్‌ విమానాశ్రయంలో దిగింది. కరోనా మహమ్మారి నేపథ్యంలో విధించిన ఆంక్షల వల్ల విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘వందే భారత్‌ మిషన్‌’లో భాగంగా ఈ విమాన సర్వీసును నడుపుతున్నారు. కొజికోడ్‌లోని రన్‌వే-10పై ఈ లోహవిహంగం సాఫీగానే ల్యాండ్‌ అయింది. అయితే ఆగకుండా రన్‌వే అంచువరకూ దూసుకెళ్లిపోయింది. అక్కడి లోయలో పడిపోయి, రెండు ముక్కలైపోయింది. ప్రమాద సమయంలో మంటలు రాజుకోలేదని ఎయిర్‌ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది.

మృతుల్లో పైలట్‌ దీపక్‌ సాథే, కో పైలట్‌ ఉన్నారని పోలీసులు చెప్పారు. శకలాల నుంచి ప్రయాణికులను కాపాడేందుకు సహాయ చర్యలు మొదలయ్యాయి. కొందరు క్షతగాత్రులను రక్షించి, ఆసుపత్రులకు తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. పక్క జిల్లాల నుంచి అగ్నిమాపక, సహాయ బృందాలను రప్పించారు. గాయపడినవారిలో ఒక తల్లి, బిడ్డ పరిస్థితి విషమంగా ఉందని రాష్ట్ర ఆరోగ్య మంత్రి కె.కె.శైలజ తెలిపారు. తీవ్ర వర్షం, చీకటి కారణంగా సహాయ చర్యలకు అవరోధం ఏర్పడుతోంది. ఈ ప్రమాదంపై విచారం వ్యక్తంచేస్తూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ట్వీట్‌ చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు, కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీలు కూడా మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. ప్రమాద ఘటనపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. రాష్ట్ర ప్రభుత్వం యంత్రాంగం మొత్తం సహాయ చర్యల్లో పాల్గొనాలని ఆదేశించారు. వీటిని సమన్వయం చేసుకునే బాధ్యతను రాష్ట్ర మంత్రి మోయిద్దీన్‌కు అప్పగించారు. మోదీతో కూడా మాట్లాడారు. కేంద్రం తరఫున అన్ని రకాల సాయాన్ని అందిస్తామని ప్రధాని హామీ ఇచ్చినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. బాధిత కుటుంబాలకు సమాచారం ఇచ్చేందుకు షార్జా, దుబాయ్‌లో భారత కాన్సులేట్‌ కార్యాలయాల్లో హాట్‌లైన్‌ నంబర్లను ఏర్పాటు చేశారు. విదేశీ వ్యవహారాల శాఖ కూడా 24 గంటలూ పనిచేసే హెల్ప్‌ లైన్లను సిద్ధం చేసింది. విమాన ప్రమాదంలో చనిపోయిన పైలట్‌ కెప్టెన్‌ దీపక్‌ సాథే గతంలో వైమానిక దళంలో పనిచేశారు. పుణెలోని ప్రతిష్ఠాత్మక నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ (ఎన్‌డీఏ)లో ప్రారంభ శిక్షణ పూర్తి చేసుకున్నారు. అనంతరం హైదరాబాద్‌లోని ఎయిర్‌ ఫోర్స్‌ అకాడమీలో పైలట్‌ శిక్షణ పొందారు. అత్యుత్తమ ప్రదర్శనతో 1981లో కోర్సును పూర్తి చేసుకున్నారు. ‘స్వోర్డ్‌ ఆఫ్‌ ఆనర్‌’ కూడా సాధించారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.