close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
చేనేతకు ఆధునికత

తెలంగాణలో 10,000 గుంట మగ్గాల స్థానంలో ఫ్రేమ్‌ లూమ్‌లు
బ్లాక్‌ సమూహాల ఏర్పాటుకు సన్నాహాలు
ఇప్పటికే 8 మంజూరు, మరో 11 క్లస్టర్ల కోసం కేంద్రానికి ప్రతిపాదనలు
నేతన్నకు వెసులుబాటు

ఈనాడు, హైదరాబాద్‌: కాళ్లూచేతులూ కదిలిస్తే కానీ కడుపు నిండని చేనేత బతుకుల్లో కష్టం కాస్త తగ్గనుంది. రేయింబవళ్లు గుంట మగ్గాలను వాడుతూ తరచూ అనారోగ్యం బారినపడే వేలాది శ్రమజీవులకు వెసులుబాటు లభించనుంది. సంప్రదాయ గుంట మగ్గాల స్థానంలో ఆధునిక ఫ్రేమ్‌లూమ్‌లు రానున్నాయి. బ్లాక్‌స్థాయి సమూహాల ద్వారా పదివేల మగ్గాల నవీకరణకు  సర్కారు సన్నాహాలు చేస్తోంది. దశలవారీగా మొత్తం మగ్గాలన్నింటినీ ఇలా మార్చాలని  యోచిస్తోంది. రాష్ట్రంలో చేనేత కార్మికులు వస్త్రాలు నేసేందుకు గుంట మగ్గాలు వాడుతున్నారు. కాళ్లు, చేతులు కదుపుతూ వస్త్రాలు తయారుచేస్తున్నారు. దీనివల్ల శ్రమ అధికమై రోగాల బారిన పడుతున్నారు. వర్షాలు పడితే గుంటల్లో నీరు నిలిచి పనులు పడకేస్తున్నాయి. తరచూ వాటికి మరమ్మతులు తప్పటం లేదు. ఈ నేపథ్యంలో గుంట మగ్గాల సమస్యలను పరిష్కరించి చేనేత కార్మికుల పని సులువయ్యేందుకు వీలుగా కొన్ని కంపెనీలు ఫ్రేమ్‌ లూమ్‌లను రూపొందించాయి.

వీటిని గుంతలకు బదులు నేలపై అమర్చి, కార్మికులు వాటి పక్కనే కూర్చొని వస్త్రాలు నేయవచ్చు. నూలునూ తేలికగా అమర్చవచ్చు. డిజైన్లకు రూపమివ్వొచ్చు. ఫలితంగా శ్రమ తగ్గుతుంది. వస్త్రోత్పత్తి, నాణ్యత పెరుగుతుంది.

చేనేత సమూహాల్లో...
ఆధునికంగా మగ్గాల మార్పిడికి కేంద్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది. నైపుణ్య శిక్షణ, మౌలిక వసతుల కల్పన ద్వారా కార్మికులకు ఉపాధిని అందించేందుకు జాతీయ చేనేత అభివృద్ధి కార్యక్రమం కింద కేంద్రం వీటిని మంజూరు చేస్తోంది. ఈ క్రమంలో చేనేత కార్మికులు పెద్దసంఖ్యలో ఉన్న ప్రాంతాలను సమూహాలు(క్లస్టర్లు)గా తెలంగాణ ప్రభుత్వం ఎంపిక చేసి కేంద్రానికి ప్రతిపాదనలు పంపగా ఇప్పటికే ఎనిమిది మంజూరయ్యాయి. ఆలేరు (నల్గొండ జిల్లా), కమలాపూర్‌, కనుకుల (కరీంనగర్‌), శాయంపేట (వరంగల్‌ గ్రామీణ), వెల్తూరు (మహబూబ్‌నగర్‌), ఆర్మూర్‌ (నిజామాబాద్‌), భూదాన్‌పోచంపల్లి (యాదాద్రి భువనగిరి) వేములవాడ (రాజన్న సిరిసిల్ల)లో వీటిని మంజూరు చేసింది. వీరికి రూ. 10.60 లక్షల నిధులు మంజూరయ్యాయి. కార్మికుల సంఖ్య దృష్ట్యా అదనంగా మరో ఎనిమిది సమూహాలను మంజూరు చేయాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ప్రతిపాదనలు పంపించింది. బచ్చన్నపేట, పాలకుర్తి (జనగామ జిల్లా), మధిర, ముజ్జుగూడెం, పొన్నికల్లు, కొయ్యలగూడెం (ఖమ్మం), భువనగిరి, యాదగిరిగుట్ట (యాదాద్రి జిల్లా), మునుగోడు, చండూరు (నల్గొండ), అమరచింత (వనపర్తిజిల్లా)కు కొత్త ప్రతిపాదనలు పంపింది. అవీ త్వరలో మంజూరవుతాయని ఆశిస్తోంది.

వెసులుబాటు ఇలా..
మొదటి ఎనిమిది సమూహాల్లో 4000, తాజాగా ప్రతిపాదించిన సమూహాల్లో 6000 చొప్పున గుంట మగ్గాలున్నాయి. మంజూరైన సమూహాల్లో ముందుగా గుంటమగ్గాల స్థానంలో ఫ్రేమ్‌మగ్గాలను అమరుస్తారు. నేత, రంగులు, రసాయనాలు, ఆకృతులు, ఇతర అంశాలపై శిక్షణ ఇస్తారు. వర్క్‌షెడ్‌, ఉమ్మడి సౌకర్యాల కేంద్రం, నూలు డిపో, రంగులు, రసాయనాల కేంద్రం ఏర్పాటుచేస్తారు. ఉత్పత్తుల అభివృద్ధి,  మార్కెటింగు పోకడలు, ఇతర అంశాలపై అవగాహన కల్పిస్తారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.