close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
పుల్వామా కుట్రదారులను వేటాడిన అబ్దుల్‌ రషీద్‌కు కీర్తి చక్ర

9 మందికి శౌర్య చక్ర

ఈనాడు, దిల్లీ: సైన్యం, పారా మిలటరీ బలగాల్లో అత్యున్నత ప్రతిభ చూపిన 84 మందికి స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ వివిధ పతకాలు ప్రకటించారు. ఇందులో ఒకరికి కీర్తి చక్ర, 9 మందికి శౌర్య చక్ర పతకాలు లభించగా మిగతా వారు సేన పతకాలు పొందారు. జమ్మూ-కశ్మీర్‌ పోలీసు విభాగంలో హెడ్‌ కానిస్టేబుల్‌గా సేవలందించిన అబ్దుల్‌ రషీద్‌ కలాస్‌ (మరణానంతరం) కీర్తి చక్ర పొందారు. రషీద్‌ 2019లో పుల్వామాలో సీఆర్‌పీఎఫ్‌ వాహన శ్రేణిపై జరిగిన దాడి ఘటనకు కుట్రదారులైన ఇద్దరు జైషే ఉగ్రవాదులను మట్టుబెట్టి అమరుడయ్యాడు. శౌర్య చక్ర పతకాలు పొందిన వారిలో.. సైన్యం నుంచి లెఫ్టినెంట్‌ కర్నల్‌ క్రిషన్‌ సింగ్‌ రావత్‌, మేజర్‌ అనిల్‌ ఉర్స్‌, హవల్దార్‌ అలోక్‌ కుమార్‌ దూబే, వాయుసేన నుంచి.. వింగ్‌ కమాండర్‌ విశాక్‌ నాయర్‌, పారామిలటరీ బలగాల నుంచి.. అమిత్‌ కుమార్‌, డీఐజీ, జమ్మూ-కశ్మీర్‌, మహవీర్‌ ప్రసాద్‌ గొడార, ఎస్సై, సీఐఎస్‌ఎఫ్‌ (మరణానంతరం), ఈరన్న నాయక, హెడ్‌ కానిస్టేబుల్‌ సీఐఎస్‌ఎఫ్‌ (మరణానంతరం), మహేంద్ర కుమార్‌ పాసవాన్‌, కానిస్టేబుల్‌, సీఐఎస్‌ఎఫ్‌ (మరణానంతరం), సతీష్‌ ప్రసాద్‌ కుశ్వాహా, కానిస్టేబుల్‌, ఓఎన్జీసీ (మరణానంతరం) ఉన్నారు.

పోలీసు దళాలకు 926 పతకాలు
కేంద్ర, రాష్ట్ర పోలీసు దళాలకు 926 పతకాలను కేంద్ర హోం మంత్రిత్వశాఖ ప్రకటించింది. అత్యధికంగా 81 శౌర్య పతకాలు జమ్మూ-కశ్మీర్‌ పోలీసులకు లభించగా, 55 పతకాలు సీఆర్‌పీఎఫ్‌కు దక్కాయి. గల్వాన్‌ లోయలో ఇటీవల చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో వీరోచితంగా పోరాడిన భారత్‌-టిబెట్‌ సరిహద్దు పోలీసు భద్రతా దళానికి (ఐటీబీపీ) చెందిన 294 మంది సిబ్బందికి డైరెక్టర్‌ జనరల్‌ (డీజీ) పతకాలు, 32 మంది సీబీఐ అధికారులకు రాష్ట్రపతి పోలీసు పతకాలు లభించాయి.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.