close

తాజా వార్తలు

బార్‌లో  కాల్పులు.. 11 మంది మృతి

రియో డి జనీరో: బ్రెజిల్‌లోని పారా రాష్ట్రం కాల్పుల మోతతో దద్దరిల్లింది. బెలెమ్‌ నగరంలోని ఓ బార్‌లో దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకరాం.. 

కార్లు, బైక్‌లపై వచ్చిన ఏడుగురు సాయుధ దుండగులు బార్‌లోకి ప్రవేశించి అక్కడి వారిపై విచక్షణారహితంగా కాల్పులకు పాల్పడ్డారు. ఘటన అనంతరం దుండగులు పారిపోతుండగా పోలీసులు వారిని వెంబడించారు. ఓ నిందితుడిని పట్టుకోగా.. మిగిలినవారు పరారయ్యారు. కాల్పుల్లో ఆరుగురు మహిళలు, ఐదుగురు పురుషులు మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఈ దాడి వెనుక కారణాలపై ఇంకా స్పష్టత రాలేదు.

 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.