Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 101364
            [news_title_telugu_html] => 

ఓటు వేశారని కుటుంబ పెద్దను చంపేశారు

[news_title_telugu] => ఓటు వేశారని కుటుంబ పెద్దను చంపేశారు [news_title_english] => PDP Worker killed for casting vote [news_short_description] => ఇటీవల జరిగిన జమ్ముకశ్మీర్‌ లోక్‌సభ ఎన్నికల్లో అత్యల్ప ఓటింగ్‌ నమోదైన విషయం తెలిసిందే. ఓటింగ్‌ను బహిష్కరించాలంటూ ఉగ్రవాదులు, వేర్పాటువాదులు హెచ్చరించడంతో పోలింగ్‌ రోజున [news_tags_keywords] => Jammu and Kashmir,PDP worker,PDP,Polling [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => | [news_videoinfo] => | [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-05-22 01:36:40 [news_isactive] => 1 [news_status] => 2 ) )
ఓటు వేశారని కుటుంబ పెద్దను చంపేశారు - PDP Worker killed for casting vote - EENADU
close

తాజా వార్తలు

ఓటు వేశారని కుటుంబ పెద్దను చంపేశారు

కుల్గాం: ఇటీవల జరిగిన జమ్ముకశ్మీర్‌ లోక్‌సభ ఎన్నికల్లో అత్యల్ప ఓటింగ్‌ నమోదైన విషయం తెలిసిందే. ఓటింగ్‌ను బహిష్కరించాలంటూ ఉగ్రవాదులు, వేర్పాటువాదులు హెచ్చరించడంతో పోలింగ్‌ రోజున ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాలేదు. కొన్ని గ్రామాల్లో అయితే కనీసం ఒక్క ఓటు కూడా పోల్‌ కాలేదు. అలాంటి పరిస్థితుల్లో ఓటు వేసి తమ బాధ్యతను నిర్వర్తించిందో పీడీపీ కార్యకర్త కుటుంబం. అయితే అందుకు ప్రతిఫలంగా కుటుంబపెద్దను కోల్పోవాల్సి వచ్చింది. ఓటు వేశారన్న కారణంతో పీడీపీ కార్యకర్తను దుండగులు కాల్చి చంపారు. 

కుల్గాంలోని జుంగల్‌పొరా గ్రామంలో ఏప్రిల్‌ 29న ఎన్నికలు జరిగాయి. 500 కుటుంబాలున్న ఈ గ్రామంలో కేవలం 7 ఓట్లు మాత్రమే పోల్‌ అయ్యాయి. ఇందులో 5 ఓట్లు పీడీపీ కార్యకర్త మహ్మద్‌ జమాల్‌ కుటుంబసభ్యులవే. పోలింగ్‌ రోజున జమాల్‌ ఆరోగ్యం సరిగా రాకపోవడంతో ఆయన ఓటు వేసేందుకు వెళ్లలేదు. కుటుంబసభ్యులకు మాత్రం తప్పకుండా వెళ్లి ఓటు వేయాలని సూచించారు. 

అయితే గత ఆదివారం జమాల్ తన ఇంట్లో ఉండగా.. ఓ దుండగుడు కిటికీ నుంచి ఆయనపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన జమాల్‌ చికిత్స పొందుతూ నిన్న ప్రాణాలు కోల్పోయారు. ఓటు వేశామన్న కక్షతోనే తమ ఇంటిపెద్దను చంపినట్లు జమాల్‌ కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ‘ఆయనకు ఎవరితోనూ శతృత్వం లేదు. కేవలం మా కుటుంబం ఓటు వేసిందన్న కారణంగానే ఆయనను చంపేశారు’ తని జమాల్‌ అల్లుడు తారిక్‌ అహ్మద్‌ భట్‌ అన్నారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.