Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 101415
            [news_title_telugu_html] => 

డబ్బుల్లేవా.. ఈ హోటల్‌లో ఉచితంగా తినొచ్చు!

[news_title_telugu] => డబ్బుల్లేవా.. ఈ హోటల్‌లో ఉచితంగా తినొచ్చు! [news_title_english] => Sakina Halal Grill Restaurant Owner Gives Free Food for Poor [news_short_description] => ‘‘మా రెస్టారెంట్‌లో భోజనం చేసే స్తోమత మీకు లేకపోతే, ఇక్కడ ఉచితంగా తినొచ్చు.’’ అని ఓ విలాసవంతమైన రెస్టారెంట్‌ యజమాని కాజీ మన్నన్‌ అంటున్నారు. ఇంతకీ ఈ రెస్టారెంట్‌ ఎక్కడ ఉందనుకుంటున్నారా..? [news_tags_keywords] => Sakina Halal Grill,Free Food,Kazi Mannan,Washington DC [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => | [news_videoinfo] => | [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-05-22 01:30:43 [news_isactive] => 1 [news_status] => 2 ) )
డబ్బుల్లేవా.. ఈ హోటల్‌లో ఉచితంగా తినొచ్చు! - Sakina Halal Grill Restaurant Owner Gives Free Food for Poor - EENADU
close

తాజా వార్తలు

డబ్బుల్లేవా.. ఈ హోటల్‌లో ఉచితంగా తినొచ్చు!

ఉదారత చాటుతున్న రెస్టారెంట్‌ యజమాని

 

వాషింగ్టన్‌ డీసీ: ‘‘మా రెస్టారెంట్‌లో భోజనం చేసే స్తోమత మీకు లేకపోతే, ఇక్కడ ఉచితంగా తినొచ్చు.’’ అని ఓ విలాసవంతమైన రెస్టారెంట్‌ యజమాని కాజీ మన్నన్‌ అంటున్నారు. ఇంతకీ ఈ రెస్టారెంట్‌ ఎక్కడ ఉందనుకుంటున్నారా..? అమెరికాలోని వాషింగ్టన్‌ డీసీలో శ్వేత సౌధానికి కూతవేటు దూరంలో ఉంటుంది. అన్ని వాణిజ్య దుకాణాల్లానే రకరకాల హంగులతో ఈ రెస్టారెంట్‌ విలాసవంతంగా కనిపిస్తుంది. కానీ ఒకటే తేడా..! భోజనం తినేందుకు డబ్బుల్లేని వారికి ఇక్కడ ఉచితంగా పెడతారు. ఈ రెస్టారెంట్‌ పేరు సకీనా హలాల్‌ గ్రిల్‌. దీని యజమానీ పాకిస్థానీ. డబ్బు చెల్లించి భోజనం చేసేవారికి, ఉచితంగా తినే వారికి ఇక్కడ ఏ తేడా ఉండదని యజమాని కాజీ మన్నన్‌ చెప్పారు. ఇలా ఇప్పటి వరకూ ఈ రెస్టారెంట్‌లో గత ఐదేళ్లలో 80 వేల భోజనాలు ఉచితంగా పెట్టినట్లు ఓ జాతీయ వార్తా సంస్థ వెల్లడించింది.
2013లో రెస్టారెంట్‌ తెరిచినప్పటి నుంచి ఇప్పటి వరకూ ఈ విధానాన్ని కొనసాగిస్తూనే ఉన్నట్లు యజమాని స్థానిక టీవీ ఛానెల్‌కు కూడా చెప్పారు.

ఎందుకిలా?
రెస్టారెంట్‌ యజమాని కాజీ మన్నన్‌ పాకిస్థానీ. నిరుపేద కుటుంబంలో జన్మించినందున చిన్నతనంలో అత్యంత దారుణ పరిస్థితుల్లో జీవించానని, తిండి లేక ఆకలితో అలమటించానని మన్నన్‌ తెలిపారు. ఆకలి తిప్పలు తెలిసినందునే ఉచిత భోజన విధానం అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. ‘‘ఇళ్లు లేని పేదవారిని నేను ఎంతో మందిని చూశా. అన్నం కోసం వారు తీవ్రంగా శ్రమిస్తుంటారు. అలాంటి వారిని చూసినప్పుడు నేను అస్సలు తట్టుకోలేను. ఆ సమయంలో నా చిన్నప్పటి రోజులు గుర్తుకొస్తాయి. ఏడాదికి 16 వేల భోజనాలు ఉచితంగా అందించాలనే నా లక్ష్యం.’’ అని కాజీ మన్నన్‌ అన్నారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.