close

తాజా వార్తలు

ఎమ్మెల్యేతో పాటు మరో 10 మంది మృతి..

ఇటానగర్‌: ఎన్‌ఎస్‌సీఎన్‌ (ఐఎం) అనుమానిత ఉగ్రవాదులు అరుణాచల్‌ ప్రదేశ్‌లో కలకలం సృష్టించారు. ఓ ఎమ్మెల్యేతో పాటు మరో 10 మందిని కాల్చి చంపారు. వారిలో ఇద్దరు భద్రతాసిబ్బంది కూడా ఉన్నారు. తిరాప్‌ జిల్లాలోని బొగాపాని గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఖోన్సా పశ్చిమ నియోజక వర్గం నుంచి ఎన్‌పీపీ తరఫున మరోసారి పోటీ చేసిన తిరోంగ్‌ అబో.. మంగళవారం అసోం నుంచి తన నియోజక వర్గంలోని ఓ ప్రాంతానికి వెళ్తున్న సమయంలో ఉగ్రవాదులు దాడి జరిపారు.

ఆ సమయంలో ఆయనతో పాటు మరో ఎనిమిది మంది వ్యక్తులు, ఇద్దరు భద్రతా బలగాలు ఉన్నారని, బోగాపనీ గ్రామంలోకి వారి వారు చేరుకోగానే వారిపైకి అనుమానిత ఉగ్రవాదులు కాల్పులు జరిపారని ఆ ప్రాంత డిప్యూటీ పోలీస్‌ కమిషనర్‌ పీఎన్‌ తుంగోన్‌ తెలిపారు. మృతుల్లో తిరోంగ్‌ అబో కుమారుడు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై స్పందించిన ఎన్‌పీపీ అధ్యక్షుడు, మేఘాలయా ముఖ్యమంత్రి కన్రాద్‌‌ సంగ్మా.. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ‘ఈ వార్త తెలుసుకొని ఎన్‌పీపీ తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. ఈ దాడి జరిపిన వారిపై చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌, పీఎంవోను కోరుతున్నాం’ అని ట్వీట్‌ చేశారు.

 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.