Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 101432
            [news_title_telugu_html] => 

గూగుల్‌ లేని హువావే ఫోన్లు పేపర్‌ వెయిట్‌లేనా?

[news_title_telugu] => గూగుల్‌ లేని హువావే ఫోన్లు పేపర్‌ వెయిట్‌లేనా? [news_title_english] => Without Google Huawei phones could become paper weights [news_short_description] => చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ హువావేపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ విధించిన నిషేధం తీవ్ర ప్రభావం చూపనుందా? సాఫ్ట్‌వేర్‌, హార్డ్‌వేర్‌ సహా ఇతర సేవలను ఇవ్వబోమని గూగుల్‌ ప్రకటన [news_tags_keywords] => Google,Huawei,smartphone [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => | [news_videoinfo] => | [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-05-22 01:33:28 [news_isactive] => 1 [news_status] => 2 ) )
గూగుల్‌ లేని హువావే ఫోన్లు పేపర్‌ వెయిట్‌లేనా? - Without Google Huawei phones could become paper weights - EENADU
close

తాజా వార్తలు

గూగుల్‌ లేని హువావే ఫోన్లు పేపర్‌ వెయిట్‌లేనా?

బీజింగ్: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ హువావేపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ విధించిన నిషేధం తీవ్ర ప్రభావం చూపనుందా? సాఫ్ట్‌వేర్‌, హార్డ్‌వేర్‌ సహా ఇతర సేవలను ఇవ్వబోమని గూగుల్‌ ప్రకటన నేపథ్యంలో హువావే స్మార్ట్‌ఫోన్‌ అమ్మకాలపై ప్రభావం ఎలా ఉంటుంది? అసలు గూగుల్‌ సేవలు లేని హువావే ఫోన్లు పేపర్‌ వెయిట్‌లతో సమానమా? అంటే పలు నివేదికలు అవుననే అంటున్నాయి. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద స్మార్ట్‌ఫోన్‌ తయారీదారుగా హువావే టాప్‌ లిస్ట్‌లో ఉంది. ఈ నేపథ్యంలో హువావే ఆండ్రాయిడ్‌ ఫ్లాట్‌ఫాం లేకుండా మొబైల్‌ ఫోన్లు తయారు చేస్తే, వినియోగదారులు ఆసక్తి చూపకపోవచ్చని హాంగ్‌కాంగ్‌కు చెందిన సౌత్‌ మార్నింగ్‌ పోస్ట్‌ తెలిపింది. ఇదే అదనుగా శాంసంగ్‌ మరో అడుగు ముందుకు వేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని పేర్కొంది. 

ప్రత్యర్థి కంపెనీలకు లాభం!
హువేవాకు శాంసంగ్‌ సహా, షామీ, ఒప్పోల నుంచి గట్టి పోటీ ఉంది. హువావేపై గూగుల్‌ నిషేధం విధించడం ఆయా కంపెనీలకు లాభించనుంది. ఇప్పటికే స్మార్ట్‌ఫోన్‌ విపణిలో తీవ్ర పోటీ నెలకొన్న సంగతి తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో హువావేకు గూగుల్‌ సేవలు నిలిపివేయడం ఆ సంస్థకు శరాఘాతమే. వినియోగదారులను ఆకట్టుకునేందుకు ప్రతి మొబైల్‌ కంపెనీలు వినూత్న ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్‌లను తీసుకొస్తున్నాయి. ఫుల్‌స్క్రీన్‌ డిస్‌ప్లేలు, పాప్‌అప్‌ కెమెరాలు, ఫ్లిప్‌ కెమెరాలతో సహా అత్యంత వేగంగా పనిచేసే చిప్‌సెట్‌లతో కొత్త కొత్త ఫోన్లను విడుదల చేస్తున్నాయి. అయితే, ఎన్ని ఫీచర్లు జోడించినా, అవన్నీ గూగుల్‌ అందించే ఆండ్రాయిడ్‌ వెర్షన్‌పైనే పని చేస్తాయి. పూర్తి ఆండ్రాయిడ్‌ ఓఎస్‌ లేకుండా(యాపిల్‌ కాదు) తీసుకొచ్చిన ఫోన్లు అంతగా విజయం సాధించలేదన్నది జగమెరిగిన సత్యం.

హువావే విక్రయాలపై ప్రభావం!
చైనాకు చెందిన చాలా స్మార్ట్‌ఫోన్లు కస్టమ్‌ యూఐతో వచ్చినా, అవన్నీ ఆండ్రాయిడ్‌ ఆధారంగా పనిచేయాల్సిందే. మరో దారిలేదు. భారత్‌ వంటి దేశాల్లో జీ-మెయిల్‌, యూట్యూబ్‌, మ్యాప్స్‌, డ్రైవ్‌లు ఇలా గూగుల్‌ అందించే సేవలను విస్తృతంగా వినియోగిస్తుంటారు. అవి లేకుండా ఫోన్లు వినియోగించే వారు చాలా అరుదు. ఇలాంటి పరిస్థితుల్లో గూగుల్‌ సేవలు లేకుండా హువావే ఫోన్లు కొనుగోలు చేయడానికి వినియోగదారులు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు. ఇది హువేవాకు అతిపెద్ద సమస్యగా పరిణమించవచ్చు. 2018లోనే 208 మిలియన్ల హువావే ఫోన్లను తయారు చేస్తే, దాదాపు అందులో సగంపైగా ఫోన్లను చైనా నుంచి ఇతర దేశాలకు షిప్‌మెంట్‌ చేశారు. ప్రస్తుత పరిస్థితి భవిష్యత్‌లో కొనసాగితే, ఆ ఫోన్ల కొనుగోళ్లు బాగా పడిపోతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. కేవలం చైనాలో మాత్రమే హువావే మనుగడ సాగించగలదని అంటున్నారు. ‘ఇది ఇలాగే కొనసాగితే భవిష్యత్‌లో హువావే ఫోన్లు పేపర్‌ వెయిట్‌లలా మిగిలిపోతాయి’ అని ఆసియా-పసిఫిక్‌ ఐడీసీ రీసెర్చ్‌ ఉపాధ్యక్షుడు బ్రయాన్‌ మా అభిప్రాయపడ్డారు. గూగుల్‌ యాప్‌లు లేని ఫోన్లను వినియోగదారులు ఎక్కువ కాలం వినియోగించలేరని పేర్కొన్నారు. 

పరిస్థితులు ఇలా ఉంటే, హువేవా వ్యవస్థాపకుడు రీన్‌ మాత్రం అమెరికాపై స్వరం పెంచారు. తమ కంపెనీని తక్కువగా అంచనా వేయొద్దని హెచ్చరిస్తున్నారు. మరోపక్క హువావే వ్యాపారం చేయడానికి వీల్లేకుండా విధించిన నిషేధాన్ని 90రోజులు సడలిస్తున్నట్లు ట్రంప్‌ సర్కారు ప్రకటించింది. ఈ మేరకు అమెరికా వాణిజ్య విభాగం ప్రకటన వెలువరించింది. ఈ నిర్ణయంతో హువావేకు కాస్త ఊరట లభించింది. అయితే, హువావేతో జాతీయ భద్రతకు ముప్పు ఉందని, ట్రంప్‌ విధించిన నిషేధంలో ఎలాంటి మార్పు ఉండదని వాణిజ్య విభాగం తెలిపింది. 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.