close

తాజా వార్తలు

నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్‌ఎల్‌వీ-సీ46

మరో విజయాన్ని ఖాతాలో వేసుకున్న ఇస్రో

శ్రీహరికోట: ఇస్రో ఖాతాలో మరో విజయం. భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) నుంచి పొలార్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌-సీ46 వాహక నౌక నింగిలోకి దూసుకెళ్లింది. 615 కిలోల బరువు గల రీశాట్‌-2బీఆర్‌1 ఉపగ్రహాన్ని పీఎస్‌ఎల్‌వీ-సీ46 వాహక నౌక 557 కి.మీ ఎత్తులోని కక్షలో ప్రేవేశపెట్టింది. దీంతో పీఎస్‌ఎల్‌వీ-సీ46 ప్రయోగం దిగ్విజయమైంది. ఈ ప్రయోగానికి సంబంధించిన కౌంట్‌డౌన్‌ మంగళవారం ఉదయం 4.30 గంటలకు ప్రారంభమైంది. 25 గంటల కౌంట్‌డౌన్‌ ముగిసిన అనంతరం బుధవారం ఉదయం 5.30 గంటలకు పీఎస్‌ఎల్‌వీ-సీ46 నింగిలోకి దూసుకెళ్లింది. రాకెట్ బయలుదేరిన తర్వాత 15.29 నిమిషాలకు ఉపగ్రహం విడిపోయింది. అత్యంత ఆధునిక రాడార్‌ ఇమేజింగ్‌ భూపరిశీలన ఉపగ్రహమైన రీశాట్‌-2బీఆర్‌1 కాలపరిమితి ఐదేళ్లు. ఈ ఉపగ్రహం రక్షణశాఖకు కీలకంగా మారనుంది. సరిహద్దుల్లో శత్రువుల కదలికలను ఈ ఉపగ్రహం సులువుగా గుర్తించేందుకు వీలుంది. అంతేకాక వ్యవసాయం, అటవీ రంగాల సమాచారంతో పాటు ప్రకృతి విపత్తుల్లో ఈ ఉపగ్రహం సాయపడనుంది. మొదటగా 2009లో రీశాట్‌ను ఇస్రో ప్రయోగించింది. 2012లో రీశాట్‌-1ను ప్రయోగించింది.  

పీఎస్‌ఎల్వీ సీ46 ప్రయోగం విజయవంతమైన సందర్భంగా ఇస్రో ఛైర్మన్‌ శివన్‌ మాట్లాడుతూ..పీఎస్‌ఎల్వీ ద్వారా ఇప్పటి వరకు 353 ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టామని తెలిపారు. చారిత్రకమైన చంద్రయాన్‌-2 ప్రయోగాన్ని జులై 9-16 మధ్య చేపట్టనున్నామని వెల్లడించారు. చంద్రయాన్‌-2 ఉపగ్రహ ప్రయోగం తర్వాత సెప్టెంబరులో చంద్రుడిపై కాలుమోపుతామని అంచనావేస్తున్నట్లు చెప్పారు. ఆతర్వాత హైరెజెల్యూషన్‌ కాటో 3 ఉపగ్రహం సహా మరికొన్ని ప్రయోగాలు చేపట్టనున్నామని శివన్‌ తెలిపారు.

 

 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.