Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 101723
            [news_title_telugu_html] => 

విధి వక్రించింది..వీధిదీపం కబళించింది

[news_title_telugu] => విధి వక్రించింది..వీధిదీపం కబళించింది [news_title_english] => electric lamp slipped killed the man [news_short_description] => ఎండ నుంచి ఉపశమనం కోసం వీధి దీపం కింద నిలబడిన వ్యక్తిపై అదే దీపం జారీ తలపై పడడంతో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ... [news_tags_keywords] => accident,crime,hyderabad [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => | [news_videoinfo] => | [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-05-22 06:46:58 [news_isactive] => 1 [news_status] => 2 ) )
విధి వక్రించింది..వీధిదీపం కబళించింది - electric lamp slipped killed the man - EENADU
close

తాజా వార్తలు

విధి వక్రించింది..వీధిదీపం కబళించింది

హైదరాబాద్‌: ఎండ నుంచి ఉపశమనం కోసం వీధి దీపం కింద నిలబడిన వ్యక్తిపై అదే దీపం జారీ తలపై పడడంతో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన జవహర్‌నగర్‌ ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... దమ్మాయిగూడ సాయిబాబానగర్‌ ప్రాంతానికి చెందిన కాముని కిష్టయ్య(50), ఈనెల 12న అంబేడ్కర్‌నగర్‌ జగదాంబ జువెలర్స్‌ సమీపంలో మిత్రుడితో మాట్లాడుతున్నాడు. ఎండ తీవ్రంగా ఉండడంతో మధ్యాహ్నం సమయంలో కాలనీలోని ఓ విద్యుత్తు స్తంభం వద్ద వీధి దీపం నీడలో నిలబడ్డాడు. ఈ క్రమంలో అకస్మాత్తుగా వీధి దీపం జారీ కిష్టయ్య తలపై పడి తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే బాధితుడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతి చెందాడు. వీధి దీపం మీద పడి వ్యక్తి మృతి చెందడంతో స్థానికులు ఆందోళన చేసేందుకు యత్నించారు. సమాచారం అందుకున్న జవహర్‌నగర్‌ పురపాలక సంఘం ఇన్‌ఛార్జి కమిషనర్‌ రఘు, మేనేజర్‌ శ్రీధర్‌రెడ్డిలు ఘటనాస్థలికి చేరుకుని బాధితుడికి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. స్థానికంగా ఉన్న ఓ వ్యక్తి విద్యుత్తు స్తంభాన్ని మార్చాడని, దీంతో వీధి దీపాన్ని సక్రమంగా బిగించకపోవడంతోనే ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపించారు. ఈ మేరకు ఘటనపై మృతుడి కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.