close

తాజా వార్తలు

విమానాన్ని ఆటోపైలట్‌లో పెట్టి.. శృంగారం

నిందితుడికి ఐదేళ్ల శిక్ష విధించిన కోర్టు

 

న్యూజెర్సీ: మైనర్‌ బాలికతో శృంగారం జరిపినందుకు అమెరికాకు చెందిన ఓ వ్యాపారవేత్తకు ఐదేళ్ల జైలు శిక్ష పడింది. 15 ఏళ్ల బాలికతో సొంత జెట్‌లో ప్రయాణిస్తూ విమానాన్ని ఆటోపైలట్‌ మోడ్‌లో పెట్టి నిందితుడు ఈ చర్యకు ఒడిగట్టాడు. 53 ఏళ్ల స్టీఫెన్‌ బ్రేడ్‌లీ మెల్‌ అనే వ్యాపార వేత్త గతేడాది డిసెంబరులో ఈ నేరానికి పాల్పడగా, విచారణ అనంతరం కోర్టు మంగళవారం శిక్ష విధించింది. స్థానిక నిబంధనల ప్రకారం.. మైనర్‌తో అక్రమ సెక్స్‌, చైల్డ్‌ పోర్నోగ్రఫీ తదితర నేరాల క్రింద ఇతనికి కోర్టు శిక్ష విధించినట్లు స్థానిక వార్తా పత్రికలు పేర్కొన్నాయి.

స్టీఫెన్‌ మెల్‌ ఓ బ్రోకరేజీ సంస్థ యజమాని. ఇతనికి సొంత విమానం ఉంది. బాధితురాలైన బాలిక తల్లి తన కుమార్తెకు పైలట్‌ పాఠాలు నేర్పాలని స్టీఫెన్‌ను ఆశ్రయించినట్లు  తెలుస్తోంది. ఈ క్రమంలో బాలికను ఒంటరిగా విమానంలో తీసుకెళ్లి స్టీఫెన్‌ ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఈయన మరో లైంగికపరమైన కేసులో కూడా నిందితుడిగా ఉన్నాడు. ఈ కేసులో తీర్పు జులైలో వెలువడనుంది. 
మరోవైపు స్టీఫెన్‌ ఛారిటీ కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొంటారు. పేద పిల్లలెవరైనా వైద్యం కోసం అమెరికాలో మరో చోటకు వెళ్లాల్సి వస్తే ఉచిత రవాణా సదుపాయం కల్పిస్తారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.