Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 102181
            [news_title_telugu_html] => 

ఏపీలో తొలి ఫలితం నర్సాపురం!

[news_title_telugu] => ఏపీలో తొలి ఫలితం నర్సాపురం! [news_title_english] => first result narsapuram [news_short_description] => ఆంధ్రప్రదేశ్‌లో పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం శాసనసభ నియోజకవర్గానికి సంబంధించి తొలి ఫలితం వెల్లడయ్యే అవకాశముంది. రాజమహేంద్రవరం గ్రామీణ, రంపచోడవరం శాసనసభ నియోజకవర్గాల ఫలితాలు ఆఖరున రానున్నాయి. [news_tags_keywords] => narsapuram,ap election 2019 [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 1 [news_videolink] => |https://www.youtube.com/embed/Onr4c7yQq8A [news_videoinfo] => |https://www.youtube.com/embed/Onr4c7yQq8A [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-05-23 06:43:47 [news_isactive] => 1 [news_status] => 2 ) )
ఏపీలో తొలి ఫలితం నర్సాపురం! - first result narsapuram - EENADU
close

తాజా వార్తలు

ఏపీలో తొలి ఫలితం నర్సాపురం!

చిట్టచివరన రాజమహేంద్రవరం, గ్రామీణం, రంపచోడవరం

 అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం శాసనసభ నియోజకవర్గానికి సంబంధించి తొలి ఫలితం వెల్లడయ్యే అవకాశముంది. రాజమహేంద్రవరం గ్రామీణ, రంపచోడవరం శాసనసభ నియోజకవర్గాల ఫలితాలు ఆఖరున రానున్నాయి. నర్సాపురం పరిధిలో అతి తక్కువ పోలింగ్‌ కేంద్రాలుండటంతో.. కేవలం 12-13 రౌండ్ల లెక్కింపుతోనే ఫలితం తేలిపోతుంది. అదే రాజమహేంద్రవరం గ్రామీణ, రంపచోడవరం నియోజకవర్గాల్లో ఓట్ల లెక్కింపునకు 36-37 రౌండ్లు పట్టనుంది. ఈ క్రమంలో ఫలితాలు అన్నింటికంటే చివర్లో వెలువడనున్నాయి. రాష్ట్రంలో 12-13 రౌండ్లలోపు ఓట్ల లెక్కింపు పూర్తయ్యే నియోజకవర్గం ఒకే ఒక్కటి ఉండగా, 36-37 రౌండ్లలోపు ఓట్ల లెక్కింపు పూర్తయ్యే నియోజకవర్గాలు రెండు ఉన్నాయి. 30 రౌండ్లు దాటి లెక్కింపు జరగాల్సిన నియోజకవర్గాలు 12 ఉన్నాయి. లెక్కింపు ప్రక్రియలో అవాంతరాలు లేకుండా సజావుగా సాగితేనే తొలి ఫలితం తొందరగా తేలుతుంది.

త్వరగా తేలే అవకాశమున్న నియోజకవర్గాలు..
12-13 రౌండ్ల లెక్కింపుతోనే ఫలితం వెలువడే నియోజకవర్గాలు: నర్సాపురం
13-14 రౌండ్ల లెక్కింపుతోనే ఫలితం తేలే నియోజకవర్గాలు: ఆచంట, కొవ్వూరు (ఎస్సీ)
14-15 రౌండ్ల లెక్కింపుతోనే ఫలితం వచ్చే నియోజకవర్గాలు: పాలకొల్లు, మచిలీపట్నం, ఏలూరు, బాపట్ల, నెల్లూరు సిటీ
15-16 రౌండ్ల లెక్కింపుతోనే ఫలితం తేలే నియోజకవర్గాలు: తాడేపల్లిగూడెం, నిడదవోలు, పెడన, చీరాల, మండపేట, చిత్తూరు, ఉంగుటూరు
16-17 రౌండ్ల లెక్కింపుతోనే ఫలితం తేలే నియోజకవర్గాలు: గుంటూరు తూర్పు, నెల్లూరు గ్రామీణ, ప్రత్తిపాడు, అనపర్తి, నగరి, పార్వతీపురం, వేమూరు, మాడుగుల, విశాఖపట్నం దక్షిణ, విశాఖపట్నం పశ్చిమ

ఫలితాలు ఆలస్యమయ్యే అవకాశమున్నవి
36-37 రౌండ్ల లెక్కింపుతో ఫలితం తేలే నియోజకవర్గాలు: రాజమహేంద్రవరం గ్రామీణ, రంపచోడవరం
35 రౌండ్ల లెక్కింపుతో ఫలితం తేలే నియోజకవర్గం: జగ్గంపేట
33రౌండ్ల లెక్కింపుతో ఫలితం వెలువడే నియోజకవర్గం: అమలాపురం
32 రౌండ్ల లెక్కింపుతో ఫలితం తేలే నియోజకవర్గాలు: పాణ్యం, నందిగామ, రాజమహేంద్రవరం సిటీ, తుని
30-31 రౌండ్ల లెక్కింపుతో ఫలితం వెలువడే నియోజకవర్గాలు: పెద్దాపురం, గన్నవరం(ఎస్సీ), రాజానగరం, కాకినాడ సిటీ.

 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.