Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 102224
            [news_title_telugu_html] => 

ఏపీలో జిల్లాల వారీగా పార్టీల ఆధిక్యం ఇలా..

[news_title_telugu] => ఏపీలో జిల్లాల వారీగా పార్టీల ఆధిక్యం ఇలా.. [news_title_english] => ysrcp leading in all districts [news_short_description] => ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో వైకాపా ఆధిక్యంలో దూసుకెళ్తోంది. అనేక జిల్లాలో జగన్‌ పార్టీ ముందంజలో కొనసాగుతోంది. ఉదయం 11 గంటల సమయంలో జిల్లాల [news_tags_keywords] => AP News,AP elections 2019,election results [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => | [news_videoinfo] => | [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-05-23 12:00:12 [news_isactive] => 1 [news_status] => 2 ) )
ఏపీలో జిల్లాల వారీగా పార్టీల ఆధిక్యం ఇలా.. - ysrcp leading in all districts - EENADU
close

తాజా వార్తలు

ఏపీలో జిల్లాల వారీగా పార్టీల ఆధిక్యం ఇలా..

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో వైకాపా ఆధిక్యంలో దూసుకెళ్తోంది. పలు జిల్లాల్లో  జగన్‌ పార్టీ ముందంజలో కొనసాగుతోంది. ఉదయం 11 గంటల సమయంలో జిల్లాల వారీగా పార్టీల ఆధిక్యాలను పరిశీలిస్తే.. 

* అనంతపురం జిల్లాలో మొత్తం 14 అసెంబ్లీ నియోజకవర్గాలుండగా.. వైకాపా 11 చోట్ల ఆధిక్యంలో ఉంది. అధికార తెదేపా 3 స్థానాల్లో ముందంజలో కొనసాగుతోంది.

* చిత్తూరుజిల్లాలో  14 నియోజకవర్గాలకు గానూ.. వైకాపా 11, తెదేపా 3 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి.

* తూర్పు గోదావరి జిల్లాలో 19 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. వైకాపా 15, తెదేపా 4 చోట్ల ముందంజలో ఉన్నాయి. 

* గుంటూరు జిల్లాలో  17 స్థానాలకు గానూ.. వైకాపా 12, తెదేపా 5 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నాయి.

* కడప జిల్లాలో మొత్తం 10 అసెంబ్లీ నియోజవర్గాల్లోనూ వైకాపానే ముందంజలో ఉంది.

* కృష్ణా జిల్లాలో 16 స్థానాలుండగా.. 12 చోట్ల వైకాపా, 4 చోట్ల తెదేపా ఆధిక్యంలో ఉన్నాయి. 

* కర్నూలు జిల్లాలో  14 నియోజకవర్గాలు ఉండగా.. వైకాపా 13, తెదేపా ఒక స్థానంలో ముందంజలో కొనసాగుతున్నాయి.

* నెల్లూరు జిల్లాలోని మొత్తం 10 అసెంబ్లీ నియోజవర్గాల్లోనూ వైకాపానే ముందంజలో ఉంది.

* ప్రకాశం జిల్లాలో 12 స్థానాలు ఉండగా.. వైకాపా 9 చోట్ల, తెదేపా 3 చోట్ల ఆధిక్యంలో ఉన్నాయి.

* శ్రీకాకుళం జిల్లాలో 10 నియోజకవర్గాలకు గానూ.. 9 స్థానాల్లో వైకాపా, ఒక స్థానంలో తెదేపా ముందంజలో ఉన్నాయి.

* విశాఖపట్నం జిల్లాలో  15 నియోజకవర్గాలు ఉండగా.. వైకాపా 11, తెదేపా 3 చోట్ల, జనసేన ఒక స్థానంలో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి.

* విజయనగరం జిల్లాలో మొత్తం 9 స్థానాల్లో వైకాపా ఆధిక్యంలో ఉంది. 

* పశ్చిమగోదావరిలో మొత్తం 15 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా.. వైకాపా 12 చోట్ల, తెదేపా 3 చోట్ల ముందంజలో కొనసాగుతున్నాయి. 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.