close

తాజా వార్తలు

సంబరాల్లో వైకాపా‌.. జగన్‌కు అభినందనల వెల్లువ

అమరావతి : ఏపీలో వైకాపా దూసుకుపోతోంది. మెజారిటీ స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. అధికార తెదేపా చతికిలపడింది. ఇప్పటివరకూ వెలువడిన ఫలితాల ప్రకారం.. వైకాపా 140కిపైగా స్థానాల్లో ఆధిక్యంలో దూసుకెళ్తుండగా.. తెదేపా ఆధిక్యం 30 స్థానాలకు మాత్రమే పరిమితమైంది.

రాష్ట్రంలో వైకాపా హవా కొనసాగుతుండటంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగి తేలుతున్నారు. ఆ పార్టీ అధ్యక్షుడు జగన్‌ను పలువురు నేతలు కలిసి అభినందనలు చెబుతున్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని జగన్‌ నివాసానికి  వచ్చిన ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆయన్ని కౌగిలించుకొని అభినందనలు తెలిపారు. తన నివాసం నుంచి ఎన్నికల ఫలితాలను టీవీలో వీక్షిస్తున్న జగన్‌తోపాటు పలువురు పార్టీ నేతలు ఉన్నారు. ఈ సందర్భంగా జగన్‌ నివాసం వద్ద పండగ వాతావరణం నెలకొంది. 

అటు లోక్‌సభ ఎన్నికల్లోనూ వైకాపా దూసుకుపోతుంది. ఇప్పటి వరకూ 23 స్థానాల్లో ఫ్యాన్‌ హవా కొనసాగుతుండగా.. తెదేపా రెండు స్థానాల్లో ముందంజలో ఉంది.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.