Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 102851
            [news_title_telugu_html] => 

ఈవీఎంలను తప్పుబట్టలేం: కేజ్రీవాల్‌

[news_title_telugu] => ఈవీఎంలను తప్పుబట్టలేం: కేజ్రీవాల్‌ [news_title_english] => Cannot Blame evms Polarization Favored BJP says App [news_short_description] => కేంద్రంలో కాషాయం మెరిసింది. 349 స్థానాలకు కైవసం చేసుకొని ఎన్డీయే కూటమి విజయదుందుభి మోగించింది. మరోవైపు దిల్లీలోని 7 స్థానాల్లోనూ విజయం ... [news_tags_keywords] => NULL [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => | [news_videoinfo] => | [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-05-25 00:20:09 [news_isactive] => 1 [news_status] => 2 ) )
ఈవీఎంలను తప్పుబట్టలేం: కేజ్రీవాల్‌ - Cannot Blame evms Polarization Favored BJP says App - EENADU
close

తాజా వార్తలు

ఈవీఎంలను తప్పుబట్టలేం: కేజ్రీవాల్‌

దిల్లీ: కేంద్రంలో కాషాయం మెరిసింది. 348 స్థానాలకు కైవసం చేసుకొని ఎన్డీయే కూటమి విజయదుందుభి మోగించింది. మరోవైపు దిల్లీలోని 7 స్థానాల్లోనూ విజయం సాధించి ఆప్‌కు ముకుతాడు బిగించింది. దీంతో పరాజయానికి గల కారణాలను సమీక్షించేందుకు ఆప్‌ సిద్ధమైంది. ఈ మేరకు ఏర్పాటు చేసిన సమావేశంలో పార్టీ కన్వీనర్‌ కేజ్రీవాల్‌ మాట్లాడుతూ. ఎన్డీయే విజయానికి ఈవీఎంలను తప్పుబట్టలేమన్నారు. భాజపా అనుకూల పవనాలు వీయడం వల్లే విజయం సాధ్యమైందన్నారు. ఈ సమావేశంలో దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా, గోపాల్‌ రాయ్‌, రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.

దిల్లీలో ఆప్‌ పరాజయానికి ఏ ఒక్కరినో నిందించలేమని పార్టీ అగ్రనేతలంతా అభిప్రాయపడ్డారు. ప్రజల్లో భాజపా పట్ల సానుకూల దృక్పథం ఉండటం వల్లే ఆ పార్టీ గెలిచిందన్నారు. తాజా ఎన్నికల్లో భాజపా 56 శాతం ఓట్లు సాధించుకుంది. 22 శాతం ఓట్లతో కాంగ్రెస్‌ రెండో స్థానంలో ఉండగా.. కేవలం 18 శాతం ఓట్లతో అధికార ఆప్‌ పార్టీ మూడో స్థానానికి పడిపోయింది. ముగ్గురు ఆప్‌ అభ్యర్థులు డిపాజిట్‌ కోల్పోయారు. ఆప్‌ పార్టీ ముఖ్యనేత, దిల్లీ తూర్పు లోక్‌సభ అభ్యర్థి అతిషి అతికష్టం మీద డిపాజిట్ దక్కించుకున్నారు. ప్రత్యర్థి, భాజపా నుంచి బరిలోకి దిగిన గౌతమ్‌ గంభీర్‌కు 6,96,156 ఓట్లు దక్కగా అతిషికి కేవలం 2,19,328 ఓట్లు పోలయ్యాయి. వచ్చే ఏడాది దిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో.. ఈ నెల 26న ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ పార్టీ ముఖ్యనేతలతో మరోసారి భేటీ కానున్నారు. తాజా ఫలితాల నేపథ్యంలో తదుపరి ఎన్నికలకు ఎలా సిద్ధం కావాలన్న అంశంపై చర్చించే అవకాశముంది.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.