Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 102887
            [news_title_telugu_html] => 

ఎంపీతో ఫొటో దిగాడు.. ఎంపీ అయ్యాడు..

[news_title_telugu] => ఎంపీతో ఫొటో దిగాడు.. ఎంపీ అయ్యాడు.. [news_title_english] => Scindia shamed...Man who stood in line for selfie with Maharaja humiliates him [news_short_description] => జ్యోతిరాదిత్య సింధియా.. కృష్ణ పాల్ యాదవ్‌.. గ్వాలియర్‌లో వీరు తెలియని ఓటరంటూ ఉండరు. సింధియాకు కృష్ణపాల్‌ ఇటు కాంగ్రెస్‌లోనూ, అటు పాఠశాలలోనూ జూనియర్‌. పాఠశాలలో కలిసి చదువుకున్న పరిచయం ఉండటంతో కృష్ణపాల్‌.. సింధియా కుటుంబానికి బాగా దగ్గరయ్యారు. [news_tags_keywords] => Jyotiraditya Scindia,Krishnapal Yadav,BJP,Congress,Lok sabha polls [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => | [news_videoinfo] => | [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-05-25 00:18:59 [news_isactive] => 1 [news_status] => 2 ) )
ఎంపీతో ఫొటో దిగాడు.. ఎంపీ అయ్యాడు.. - Scindia shamed...Man who stood in line for selfie with Maharaja humiliates him - EENADU
close

తాజా వార్తలు

ఎంపీతో ఫొటో దిగాడు.. ఎంపీ అయ్యాడు..

ఇంటర్నెట్‌ డెస్క్‌: జ్యోతిరాదిత్య సింధియా.. కృష్ణ పాల్ యాదవ్‌.. గ్వాలియర్‌లో వీరు తెలియని ఓటరంటూ ఉండరు. సింధియాకు కృష్ణపాల్‌ ఇటు కాంగ్రెస్‌లోనూ, అటు పాఠశాలలోనూ జూనియర్‌. పాఠశాలలో కలిసి చదువుకున్న పరిచయం ఉండటంతో కృష్ణపాల్‌.. సింధియా కుటుంబానికి బాగా దగ్గరయ్యారు. ఈ చనువుతోనే కాంగ్రెస్‌లోనూ చేరారు. కొన్నాళ్ల పాటు ఇద్దరూ అన్నదమ్ముల్లాగా కలిసి ఉన్నారు. కాంగ్రెస్‌ ద్వారా కృష్ణపాల్‌ కావల్సినంత పాపులారిటీ సంపాదించుకున్నాడు. గతేడాది జరిగిన ఎన్నికల్లో అతడికి తగిన ప్రాముఖ్యం ఇవ్వలేదన్న వంకతో భాజపాలో చేరారు. అసలే సింధియాను ఓడించాలన్న దృఢ నిశ్చయంతో ఉన్న భాజపాకు కృష్ణపాల్‌ రూపంలో మంచి అవకాశం దొరికింది.సింధియాను ఓడించగలడన్న నమ్మకంతో లోక్‌ సభ ఎన్నికల్లో అతడినే సింధియా మీదకు ప్రత్యర్థిగా దించింది. 

మధ్యప్రదేశ్‌లో గతేడాది జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ జయకేతనం ఎగరేసి అధికారంలోకి రావడంలో జ్యోతిరాదిత్య సింధియాది కీలక పాత్ర. తన వాక్చాతుర్యంతో ప్రచారంలో ప్రజలను ఆకట్టుకుని అప్పటి దాకా అధికారంలో ఉన్న భాజపాను గద్దె దింపారు. అయితే తాజాగా జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం సింధియాకు చుక్కెదురైంది. రాజకీయంగా యాదవ్‌కు అంత అనుభవం లేనప్పటికీ ఈ ఎన్నికల్లో గుణ లోక్‌సభ స్థానం ప్రజలు అతడికే పట్టం కట్టారు. స్థానికంగా భాజపాకు ఉన్న మద్దతు కారణంగా యాదవ్‌ గట్టెక్కారు. ఫలితంగా సింధియా ఘోర ఓటమి చవి చూశారు. అయితే సింధియా కుటుంబం నుంచి ఇప్పటి వరకు ఎవరో ఒకరు లోక్‌ సభలో అడుగుపెడుతూనే ఉన్నారు. కానీ ఈసారి మాత్రం ఆ అవకాశం లేకుండా పోయింది.

ఒకప్పుడు సింధియాతో సెల్ఫీ తీసుకోవడానికి లైన్లో నిలబడిన వ్యక్తి కృష్ణపాల్‌..ఇప్పుడు ఆయననే ఓడించారు. వృత్తిపరంగా వైద్యుడైన యాదవ్‌ కుటుంబం ఇప్పటికీ కాంగ్రెస్‌తో సఖ్యతగానే ఉంది. కానీ యాదవ్‌, సింధియా మాత్రం రాజకీయ ప్రత్యర్థులుగా మారారు. ప్రస్తుతం వీరికి సంబంధించిన కొన్ని ఫొటోలు వైరల్‌ అవుతున్నాయి. సింధియాతో సెల్ఫీ దిగటానికి పాల్‌ ప్రయత్నిస్తున్నప్పటి ఫొటోను సింధియా భార్య ప్రియదర్శిని ఎన్నికల సమయంలో సోషల్‌ మీడియాలో పంచుకున్నారు. ‘కేపీ యాదవ్‌..జ్యోతిరాదిత్య సింధియాతో సెల్ఫీ తీసుకోవడానికి లైన్లో నిలబడే ఓ వ్యక్తి. భాజపా ఇప్పుడు ఆయనను సింధియా మీదకి పోటీగా దింపింది’ అని క్యాప్షన్‌ ఇచ్చి షేర్‌ చేశారు. ఇప్పుడవి వైరల్‌ అవుతున్నాయి. సెల్ఫీ దిగడానికి కష్టపడిన వ్యక్తి ఇప్పుడు సింధియాను ఓడించాడని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. 
 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.