close

తాజా వార్తలు

శ్రీశైలం ఆలయం వద్ద కారు బీభత్సం 

శ్రీశైలం:  కర్నూలు జిల్లా శ్రీశైలం మహా క్షేత్రంలోని సాక్షిగణపతి ఆలయం వద్ద ఓ కారు బీభత్సం సృష్టించింది. ఈఘటనలో ఆరుగురు గాయపడ్డారు.  దేవస్థానం అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ వ్యక్తి కొత్తగా కొన్న తన కారును పూజ కోసం ఆలయం వద్దకు తీసుకొచ్చారు. పూజ అనంతరం వాహనాన్ని డ్రైవర్ స్టార్ట్‌ చేసి బ్రేకుకు బదులుగా ఎక్స్‌లేటర్‌ తొక్కడంతో ఒక్కసారిగా ఆలయంలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా.. నలుగురు స్వల్పంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న దేవస్థానం అధికారులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.
 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.