close

తాజా వార్తలు

గెలిచినా ఓడినా మీతోనే ఉంటా: నారా లోకేశ్‌

మంగళగిరి: ఎన్నికల ప్రచారంలో గడప గడపకూ వచ్చానని.. గెలిచినా, ఓడినా ప్రజలతోనే ఉంటానని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అన్నారు. ఆదివారం వివిధ నియోజకవర్గాల నుంచి వచ్చిన తెదేపా కార్యకర్తలను నాయకులను ఆయన కలుసుకున్నారు. ఈ సందర్భంగా వారితో దిగిన ఫొటోలను ట్విటర్‌ వేదికగా పంచుకున్నారు. ప్రజా తీర్పును గౌరవించాలని, ఇకపై పార్టీ బలోపేతానికి కలిసి పనిచేద్దామని చెప్పారు. 

‘ఇకపై మరింత బాధ్యతతో పనిచేసి ప్రజలకు చేరువవ్వాలి. ఎన్నికలలో మీరు నాకు అందించిన సహకారానికి కృతజ్ఞతలు. ఓటమికి కార్యకర్తలు, నాయకులు ఎవరూ అధైర్యపడొద్దు. ఫలితాలపై విశ్లేషణ తరువాత భవిష్యత్ ప్రణాళిక సిద్ధం చేసుకుందాం. మనకి పార్టీ అండగా ఉంది. ప్రజలు ఎవరికి ఓటువేసినా సరే నా మాట మారదు. అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా సరే మీరు నా కుటుంబ సభ్యులు. మీకోసం నా ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. కష్టం, నష్టం, సంతోషం, సంబరం ఏదైనా సరే మీతోనే నా ప్రయాణం. నేను మీలో ఒకడిని.. మీ వాడిని.’’

‘‘ఎన్నికలు ఐదేళ్లకు ఒకసారి జరిగేవి.. వాటివల్ల అధికార మార్పిడి జరగొచ్చు. కానీ, మీతో నా అనుబంధాన్ని మార్చలేవు. మంగళగిరి నియోజకవర్గం నా ఇల్లు. మీరంతా నా కుటుంబం అని ప్రచారంలో చెప్పింది వట్టి మాటలు కాదు.  గడప గడపకు వచ్చాను, గెలిచినా ఓడినా మీతోనే ఉంటాను అని చెప్పాను.’’ అని చెప్పుకొచ్చారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.