Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 111484
            [news_title_telugu_html] => 

విడిపోయాక రేప్‌ చేశాడంటే ఎలా?

[news_title_telugu] => విడిపోయాక రేప్‌ చేశాడంటే ఎలా? [news_title_english] => Zarina Wahab Says Husband Aditya Pancholi Accused By Kangana Ranaut Of Assault Has Done No Wrong [news_short_description] => తన భర్త ఆదిత్య పంచోలీ ఏ తప్పూ చేయలేదని అంటున్నారు బాలీవుడ్‌ నటి జరీనా వాహబ్‌. పదమూడేళ్ల క్రితం ఆదిత్య తనను మానసికంగా, లైంగికంగా వేధించాడంటూ కంగన గతంలో షాకింగ్‌ కామెంట్స్‌ [news_tags_keywords] => kangana ranaut,aditya pancholi,zarina wahab [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => | [news_videoinfo] => | [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-06-13 10:41:01 [news_isactive] => 1 [news_status] => 2 ) )
విడిపోయాక రేప్‌ చేశాడంటే ఎలా? - Zarina Wahab Says Husband Aditya Pancholi Accused By Kangana Ranaut Of Assault Has Done No Wrong - EENADU
close

తాజా వార్తలు

విడిపోయాక రేప్‌ చేశాడంటే ఎలా?

నా భర్త ఏ తప్పూ చేయలేదు
కంగనపై జరీనా వాహబ్‌ కామెంట్లు

ముంబయి: తన భర్త ఆదిత్య పంచోలీ ఏ తప్పూ చేయలేదని అంటున్నారు బాలీవుడ్‌ నటి జరీనా వాహబ్‌. పదమూడేళ్ల క్రితం ఆదిత్య తనను మానసికంగా, లైంగికంగా వేధించాడంటూ కంగన గతంలో షాకింగ్‌ కామెంట్స్‌ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదిత్య ముందు జాగ్రత్తగా కంగనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఈ కేసు పరిశీలనలో ఉంది. ఈ విషయం గురించి తాజాగా జరీనా ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడుతూ.. 

‘నా భర్త ఏ తప్పూ చేయలేదు. ఆయన గురించి నాకంటే బాగా ఎవ్వరికీ తెలీదు. నా వద్ద ఏ విషయమూ దాచేవారు కాదు. గతంలో కంగన, ఆదిత్య విషయంలో ఏం జరిగిందో నాకు తెలుసు. పెళ్లైన వ్యక్తితో ఏళ్ల తరబడి డేటింగ్‌ చేసి, తీరా విడిపోయాక అత్యాచారం చేశాడు అంటే ఎలా?(కంగనను ఉద్దేశిస్తూ). అది చాలా తప్పు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు జరీనా. 
బాలీవుడ్‌ నటుడు హృతిక్‌ రోషన్‌పైనా కంగన ఎన్నో ఆరోపణలు చేశారు. దాంతో పరస్పరం ఇద్దరూ ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకున్నారు. ఈ కేసులపై ప్రస్తుతం విచారణ దశలో ఉన్నాయి.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.