
తాజా వార్తలు
న్యూదిల్లీ: జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాద కార్యకలాపాలకు అందుతున్న విరాళాల విషయంలో విచారణ జరుపుతున్న జాతీయ దర్యాప్తు బృందం (ఎన్ఐఏ) ఆదివారం పలు విషయాలను వెల్లడించింది. ఆ రాష్ట్రంలోని వేర్పాటువాద నాయకులు ఇతర దేశాల నుంచి నిధులు తీసుకొని, వాటిని తమ సొంత ప్రయోజనాలకు వినియోగించుకున్నారని తెలిపింది. వాటిల్లో చాలా నిధులను విదేశాల్లో చదువుకుంటున్న తమ పిల్లలు, బంధువుల కోసమే ఖర్చు పెట్టారని పేర్కొంది. హురియత్ కాన్ఫరెన్స్‌తో పాటు ఇతర వేర్పాటు సంస్థల అగ్ర నాయకులను ఎన్ఐఏ విచారించింది. కశ్మీర్‌లోయలో ప్రజల్లో వేర్పాటు వాదానికి ఆజ్యం పోయడానికి తాము పాకిస్థాన్ నుంచి నిధులు తీసుకున్నట్లు వారు అంగీకరించారని ఎన్ఐఏ తెలిపింది. కశ్మీర్లో యువతను ఉగ్రవాదం వైపునకు ప్రోత్సహిస్తున్న వేర్పాటువాదులు తమ కుమారులను మాత్రం విదేశాల్లో చదివించడం గమనార్హం.
మలేసియాలో ఉన్న తన కుమారుడి విద్యాభ్యాసానికి అయ్యే డబ్బును అతడికి తాను జహూర్ వాతాలీ అనే వ్యక్తి ద్వారా అందిస్తున్నట్లు దుఖ్తరాన్ ఎ మిల్లత్‌కు చెందిన నాయకురాలు అసియా అన్ద్రబీ విచారణలో తెలిపింది. జహూర్ వాతాలీని కూడా ఇటీవల అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. కశ్మీర్‌లోయలో ముస్లిం మహిళలతో ఆందోళనలు నిర్వహించడానికి తాను విదేశాలు, దుఖ్తరాన్ ఎ మిల్లత్ సంస్థ నుంచి నిధులు సేకరిస్తున్నట్లు అన్ద్రబీ అంగీకరించింది. ఆమె తన కుమారుడికి నిధులు పంపడం కోసం వినియోగించిన బ్యాంకు ఖాతాల గురించి ఎన్ఐఏ ప్రస్తుతం ఆరా తీస్తోంది.
మరో కరడుగట్టిన వేర్పాటువాద నాయకుడు షబ్బీర్ షా కూడా పాక్ నుంచి నిధులు తీసుకుని, హోటల్ వ్యాపారాలు కొనసాగిస్తున్నాడు. వీటితో పాటు పలు ప్రాంతాల్లో ఆయనకు ఉన్న ఆస్తుల గురించి ఎన్ఐఏ ప్రశ్నలు అడిగింది. జమ్ముకశ్మీర్‌లోని వేర్పాటు వాదులు ఇలా విదేశాల నుంచి నిధులు తీసుకుని సొంత ప్రయోజనాలు పొందుతున్నారు. మరోవైపు, కశ్మీర్‌లోయలో అస్థిరత, హింసాత్మక ఆందోళనలు, భారత వ్యతిరేక కార్యకలాపాలకు కూడా ఈ నిధులను వినియోగించారు. వీటివల్ల హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. వీటిల్లో పెద్ద సంఖ్యలో పౌరుల, భద్రతా బలగాల మరణాలు చోటు చేసుకున్నాయి. కాగా, ఉగ్రవాద కార్యకలాపాల కోసం నిధులు సేకరిస్తున్న జమ్ముకశ్మీర్‌లోని పలు సంస్థలు, వేర్పాటువాద నాయకులపై మే, 2017న ఎన్ఐఏ కేసు నమోదు చేసింది. ఈ కేసు విచారణలో భాగంగా కీలక విషయాలు వెల్లడవుతున్నాయి.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- చెప్పేస్తుందేమోనని.. చంపేశారు
- 22 ఏళ్లకే ఐపీఎస్ అధికారి..!
- భారతా.. విండీసా.. వరుణుడా.. ఆరంభమెవరిదో?
- నలుదిశలా ఐటీ
- షేవ్చేసుకోకుండా.. సేవ చేస్తారు
- తెలుగు రాష్ట్రాలు.. ఆసక్తికర చిత్రాలు
- యువతిపై అత్యాచారం.. ఆపై నిప్పు
- ఏమీ లేని స్థితిని చూసిన వాణ్ని
- ‘మా వస్తువులు మేమే డెలివరీ చేసుకుంటాం’
- విధ్వంసాన్ని చూస్తూ ఊరుకోను: మమత
ఎక్కువ మంది చదివినవి (Most Read)
