close

తాజా వార్తలు

రెస్టారెంట్‌లో వాగ్వాదానికి దిగిన అఫ్గాన్‌ క్రికెటర్లు!

విచారణ చేస్తున్న మాంచెస్టర్‌ పోలీసులు

మాంచెస్టర్‌: ప్రపంచకప్‌లో భాగంగా మంగళవారం ఆతిథ్య ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్‌ 150 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మ్యాచ్‌కు ముందు సోమవారం రాత్రి అఫ్గాన్‌ ఆటగాళ్లు కొందరు మాంచెస్టర్‌లోని ఓ రెస్టారెంట్‌కి వెళ్లి ఓ వ్యక్తితో వాగ్వాదానికి దిగారని  సమాచారం. ఓ అంతర్జాతీయ మీడియా తెలిపిన వివరాల ప్రకారం.. పలువురు అఫ్గాన్‌ ఆటగాళ్లు సోమవారం మాంచెస్టర్‌లోని ఓ రెస్టారెంట్‌కు వెళ్లారు. అక్కడ ఓ వ్యక్తి వీరిని వీడియో తీస్తుండగా వద్దని వారించారు. అతడితో వాగ్వాదానికి దిగారు. ఇది గొడవకు దారితీసిందని సమాచారం. 

ఇదిలా ఉండగా మాంచెస్టర్‌ పోలీసులు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. స్థానిక కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 11:15 గంటలకు లివర్‌పూర్‌రోడ్డులోని రెస్టారెంట్‌లో గొడవ జరుగుతోందని సమాచారం అందింది. వెంటనే అక్కడికి చేరుకున్నాం. అయితే ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాకపోవడంతో ఎవరినీ అరెస్టు చేయలేదు’ అని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నామని పోలీసులు పేర్కొన్నారు. 
 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.