close

తాజా వార్తలు

సింహాల హావభావాలు అదుర్స్‌!

టోక్యో: జపాన్‌లోని ఓ జంతు ప్రదర్శనశాలలో రెండు సింహాలు కనబర్చిన ముఖకవళికలకు సంబంధించిన దృశ్యాలు అంతర్జాలంలో చక్కర్లు కొడుతున్నాయి. సింహాలు ఉండే ఎన్‌క్లోజర్‌లోంచి సింహాలు తప్పించుకుని బయటకు వస్తే వాటిని ఎలా పట్టుకోవాలన్న విషయంపై సిబ్బందికి శిక్షణ ఇస్తున్న సమయంలో ఈ ఆసక్తకర దృశ్యాలు కెమెరాకు చిక్కాయి.‌ ఈహిమ్‌లోని టోబె జూలో ఓ వ్యక్తికి సింహాన్ని పోలి ఉండే దుస్తులు వేశారు. ఎన్‌క్లోజర్‌ నుంచి సింహం తప్పించుకుంటే ఎలా ప్రవర్తిస్తుందో ఆయన అలా ప్రవర్తించాడు. సిబ్బంది అతడిని పట్టుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుని వచ్చారు.

అయితే, ఈ ప్రదర్శనను చూసిన నిజమైన సింహాలు ఆ సమయంలో కనబర్చిన ముఖకవళికలు విచిత్రంగా ఉండడంతో ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌ అవుతోంది. ఈ వీడియోపై నెటిజన్లు జోకులు వేస్తూ కామెంట్లు చేస్తున్నారు. ఇటువంటి ఎక్స్‌ప్రెషన్స్‌ తమ జీవితంలో ఎన్నడూ చూడలేదని అంటున్నారు. ఈ వీడియోను ఇప్పటికి లక్షలాది మంది వీక్షించారు. సింహం ఎన్‌క్లోజర్‌ నుంచి తప్పించుకోగా దాని చుట్టూ వలలు వేసి, చివరకు మత్తు ఇంజక్షన్‌ ఇచ్చి దాన్ని పట్టుకున్నట్లు జూ సిబ్బంది ఈ డ్రిల్‌ నిర్వహించారు. 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.