close

తాజా వార్తలు

ఒక్క ప్రజావేదికనే కూల్చడం సరికాదు: కన్నా

విజయవాడ: కృష్ణా నది కరకట్ట వెంట ఉన్న అక్రమ నిర్మాణాలన్నీ కూల్చివేస్తామంటే తమకేమీ అభ్యంతరం లేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. అలాకాకుండా ఒక్క ప్రజావేదిక మాత్రమే కూల్చాలనుకుంటే సరికాదన్నారు. ప్రజాధనంతో నిర్మించిన ఆ ప్రజావేదికను ప్రజల అవసరాలకే వినియోగించాలని సూచించారు. ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదన్న ఆయన.. ఇంకా ఆ పేరుతో రాజకీయాలు చేయొద్దన్నారు. సాధ్యపడే విషయమైతే అంతకన్నా ఎక్కువ ప్యాకేజీ రూపంలో కేంద్రం ఎందుకిస్తుంది అని ప్రశ్నించారు. ఇప్పటికైనా రాజకీయ పార్టీలు ఇంకా ప్రజల్ని మోసం చేయకుండా కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రయత్నం చేయాలన్నారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.