Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 117475
            [news_title_telugu_html] => 

చంద్రబాబుకు చెప్పే దిల్లీ వచ్చా:తెదేపా ఎమ్మెల్యే

[news_title_telugu] => చంద్రబాబుకు చెప్పే దిల్లీ వచ్చా:తెదేపా ఎమ్మెల్యే [news_title_english] => MLA Anagani satyaprasad Press meet in Delhi [news_short_description] => గుంటూరు జిల్లా రేపల్లె తెదేపా ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌ భాజపా నేతలను కలిశారంటూ వస్తోన్న వార్తలను ఆయన ఖండించారు. బుధవారం రాత్రి ఆయన దిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. [news_tags_keywords] => Anagani Satyaprasad,TDP MLA,ap politics [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => | [news_videoinfo] => | [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-06-27 00:16:59 [news_isactive] => 1 [news_status] => 2 ) )
చంద్రబాబుకు చెప్పే దిల్లీ వచ్చా:తెదేపా ఎమ్మెల్యే - MLA Anagani satyaprasad Press meet in Delhi - EENADU
close

తాజా వార్తలు

చంద్రబాబుకు చెప్పే దిల్లీ వచ్చా:తెదేపా ఎమ్మెల్యే

దిల్లీ: తాను పార్టీ మారానంటూ వస్తోన్న వార్తలు అవాస్తమని గుంటూరు జిల్లా రేపల్లె తెదేపా ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌ స్పష్టం చేశారు. భాజపా నేతలను కలిశారంటూ వచ్చిన వార్తలను ఆయన ఖండించారు. బుధవారం రాత్రి అనగాని దిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. తన వ్యక్తిగత పనులపైనే దిల్లీకి వచ్చానని స్పష్టంచేశారు. భాజపా కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిసినట్లు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానన్నారు. తెదేపాలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు.  ఈరోజు సమావేశం ఉందని తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నివాసం నుంచి తనకు ఫోన్‌ వచ్చిందని.. రెండు రోజుల పాటు తాను దిల్లీకి వెళ్తున్నట్టు చెప్పానన్నారు. దిల్లీకి వెళ్తున్నానని చెప్పే వచ్చానన్నారు. ఇటీవల ఏపీలో జరిగిన ఎన్నికల్లో భాజపా ఓట్ల శాతం కూడా పడిపోయిందని చెప్పారు. భాజపా అన్యాయం చేసిందనే భావన ప్రజల్లో ఉందని.. అందుకే ఆ పార్టీకి వ్యతిరేకంగా ప్రజలు ఓట్లు వేశారన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత వైకాపాపై ఉందన్నారు. చంద్రబాబు గొప్ప నాయకుడన్నారు. ఎంపీ గరికపాటి మోహన్‌రావు తనకు ఆప్తుడని.. అనారోగ్యంతో ఉన్న ఆయన్ను పరామర్శించేందుకే  దిల్లీ వచ్చానని తెలిపారు. ఒక పార్టీలో గెలిచి వేరే పార్టీలోకి వెళ్లడం సరికాదని అనగాని అభిప్రాయపడ్డారు. 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.