Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 119000010
            [news_title_telugu_html] => 

నీకంటే చాలా చిన్న వాడితో డేటింగ్‌ ఏంటి?

[news_title_telugu] => నీకంటే చాలా చిన్న వాడితో డేటింగ్‌ ఏంటి? [news_title_english] => These are their personal opinions says malaika arora [news_short_description] => బాలీవుడ్‌ నటులు అర్జున్‌ కపూర్‌, మలైకా అరోరా గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్నారు. ఈ విషయంపై ఇప్పటికే పలు సందర్భాల్లో వీరు స్పష్టత ఇచ్చారు. ‘కాఫీ విత్‌ కరణ్‌’ షోలో అర్జున్‌.. మలైకాతో బంధం గురించి బయటపెట్టారు. మలైకా కూడా... [news_tags_keywords] => Malaika Arora ,arjun kapoor,relations [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-24 07:39:37 [news_isactive] => 1 [news_status] => 2 ) )
నీకంటే చాలా చిన్న వాడితో డేటింగ్‌ ఏంటి? - These are their personal opinions says malaika arora - EENADU
close

తాజా వార్తలు

నీకంటే చాలా చిన్న వాడితో డేటింగ్‌ ఏంటి?

విమర్శలపై మలైకా రియాక్షన్‌ ఇది

ముంబయి: బాలీవుడ్‌ నటులు అర్జున్‌ కపూర్‌, మలైకా అరోరా గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్నారు. ఈ విషయంపై ఇప్పటికే పలు సందర్భాల్లో వీరు స్పష్టత ఇచ్చారు. ‘కాఫీ విత్‌ కరణ్‌’ షోలో అర్జున్‌.. మలైకాతో బంధం గురించి బయటపెట్టారు. మలైకా కూడా ఇటీవల అర్జున్‌ ఫొటోను షేర్‌ చేస్తూ.. ‘ఇతడు నావాడు’ అని పోస్ట్‌ చేశారు. త్వరలో వీరి వివాహం జరగబోతోందని కూడా ప్రచారం జరుగుతోంది.

అయితే మలైకా కంటే అర్జున్‌ 11 ఏళ్లు చిన్నవాడు కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో వీరు డేటింగ్‌లో ఉండటాన్ని పలువురు తప్పుపట్టారు. అర్జున్‌తో కలిసి దిగిన ఫొటో షేర్‌ చేయడాన్ని కూడా విమర్శించారు. ఈ విషయం గురించి మీడియా నటిని ప్రశ్నించింది. దీనికి ఆమె స్పందిస్తూ.. ‘ప్రజలు ఇతరులు చేసే ప్రతి పనినీ పరిశీలిస్తుంటారు, విమర్శిస్తుంటారు. ప్రతి సెలబ్రిటీకి ఈ పరిస్థితి వస్తుంది. విమర్శకుల్ని మనం ఆపలేం. అవన్నీ వాళ్ల వ్యక్తిగత అభిప్రాయాలు’ అని అన్నారు.

మలైకా ‘ఛయ్య ఛయ్య..’, ‘అనార్కలీ డిస్కో చెలీ..’, ‘మున్నీ బద్నామ్‌ హుయీ..’ తదితర పాటలతో గుర్తింపు తెచ్చుకున్నారు. గత 19 ఏళ్లలో ఆమె ఒక్క పూర్తిస్థాయి పాత్రలోనూ నటించలేదు. దీని గురించి ఆమెను అడగగా.. ‘నేనెప్పుడూ ఈ విషయంలో బాధపడలేదు, నాకు ఆ ఆసక్తి కూడా లేదు’ అని చెప్పారు. మలైకా ప్రస్తుతం పలు టీవీ షోలకు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్నారు. సొంతంగా ఓ యోగా స్టూడియోను నడుపుతున్నారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.