Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 119000446
            [news_title_telugu_html] => 

సైబర్‌ కామాంధుడు

[news_title_telugu] => సైబర్‌ కామాంధుడు [news_title_english] => vulger behaviour in Online [news_short_description] => సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ దారి తప్పాడు.. ఉద్యోగాలిప్పిస్తానంటూ మభ్యపెట్టి వాట్సాప్‌ ద్వారా మహిళల నగ్నచిత్రాలను సేకరించాడు. 16 రాష్ట్రాల్లోని సుమారు 2 వేల మందితో చెలగాటమాడాడు.... [news_tags_keywords] => Online, CyberCrime,Chennai [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => gk45L0MBg8A [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-24 08:05:42 [news_isactive] => 1 [news_status] => 2 ) )
సైబర్‌ కామాంధుడు - vulger behaviour in Online - EENADU
close

తాజా వార్తలు

సైబర్‌ కామాంధుడు

ఉద్యోగాల పేరిట మహిళలపై ఎర
తానూ మహిళనేనంటూ వాట్సాప్‌లో ఇంటర్వ్యూ పేరిట చాటింగ్‌
2 వేల మంది నగ్న చిత్రాల సేకరణ
నగ్నంగా వీడియో కాలింగ్‌ చేసి లైంగిక వాంఛ తీర్చాలని డిమాండ్‌
300 మందితో ఆన్‌లైన్‌లో అసభ్య చేష్టలు
చెన్నై సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరు దారుణ దురాగతాలివి

హైదరాబాద్‌: సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ దారి తప్పాడు.. ఉద్యోగాలిప్పిస్తానంటూ మభ్యపెట్టి వాట్సాప్‌ ద్వారా మహిళల నగ్నచిత్రాలను సేకరించాడు. 16 రాష్ట్రాల్లోని సుమారు 2 వేల మందితో చెలగాటమాడాడు. ఒంటి మీద దుస్తుల్లేకుండా వాట్సాప్‌ వీడియో కాలింగ్‌ చేయమని చెప్పి వారిని అలా చూస్తూ లైంగిక చర్యలకు పాల్పడేవాడు. దాదాపు 300 మంది అతడి ఉచ్చులో పడి విలవిల్లాడిపోయారు. ఓ బాధితురాలి ఫిర్యాదుతో సైబరాబాద్‌ పోలీసులు లోతుగా విచారించారు. ఆ ప్రబుద్ధుడి దురాగతాలను ఇలా బహిర్గతం చేశారు.

ఈ ఏడాది ఆరంభంలో వికృత ఆలోచనలకు బీజం
తమిళనాడు తిరువొత్తియూర్‌కు చెందిన క్లెమెంట్‌ రాజ్‌ అలియాస్‌ ప్రదీప్‌(33) ఎన్‌ఎంసీ చెన్నై బ్యాంకు కాలనీలో ఉంటున్నాడు. టీసీఎస్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌. రాత్రి పూట విధులు నిర్వర్తిస్తుంటాడు. 2011లో వివాహం చేసుకున్న ఇతడికి ఏడేళ్ల కొడుకున్నాడు. భార్య ఉద్యోగానికి వెళ్లే క్రమంలో పగటి పూట ఇంట్లో ఒంటరిగానే ఉండేవాడు. ఈ ఏడాది ఆరంభంలో అతడి మనసులో వికృత ఆలోచనలకు బీజం పడింది. ఆన్‌లైన్‌లో ఆడవారిని నగ్నంగా చూస్తూ లైంగిక వాంఛ తీర్చుకోవాలనే కోరికతో అడ్డదారి తొక్కాడు. క్వికర్‌.కాం వెబ్‌సైట్‌లో వెతకడం ఆరంభించాడు. రిసెప్షనిస్ట్‌ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్న యువతులను లక్ష్యంగా చేసుకున్నాడు. వారి దరఖాస్తుల్లోని సెల్‌ నంబర్లకు ఫోన్‌ చేసేవాడు. తన పేరు ప్రదీప్‌ అని.. రాడిసన్‌ హోటల్‌లో ఉద్యోగుల ఎంపిక బాధ్యతలు చూస్తానని పరిచయం చేసుకునేవాడు. ‘మీ ప్రొఫైల్‌ చూశాను.. మా సంస్థ మానవ వనరుల విభాగం ప్రతినిధి వాట్సాప్‌లో ఇంటర్వ్యూ చేస్తారు’ అని చెప్పేవాడు.

మహిళనంటూ చాటింగ్‌.. తర్వాత వీడియో కాలింగ్‌
తొలుత మహిళలతో మాట్లాడిన అనంతరం వారి మానసిక స్థితిపై ఓ అంచనాకు వచ్చేవాడు. తర్వాత మరో ఫోన్‌ నంబర్‌ నుంచి వాట్సాప్‌ ద్వారా మహిళ పేరుతో ఇంటర్వ్యూ అంటూ వారితో చాటింగ్‌ చేసేవాడు. ఫ్రంట్‌ ఆఫీస్‌ ఉద్యోగం కాబట్టి అందంగా ఉండాల్సిన అవసరం ఉందంటూ ముగ్గులోకి దింపేవాడు. తొలుత యువతుల సాధారణ చిత్రాల్ని సేకరించేవాడు. తర్వాత శరీరాకృతి చూడాల్సిన అవసరం ఉంటుందనేవాడు. ఎంపిక ప్రక్రియలో అదో భాగమని నమ్మించేవాడు. నేనూ మహిళనే కదా.. అంటూ ప్రలోభానికి గురి చేసి నగ్న చిత్రాలను సేకరించేవాడు. అలా దేశ వ్యాప్తంగా 16 రాష్ట్రాలకు చెందిన సుమారు 2వేల మంది మహిళల నగ్నచిత్రాలను వాట్సాప్‌లో తెప్పించుకున్నాడు. అనంతరం నేరుగా రంగంలోకి దిగి బెదిరింపులకు పాల్పడేవాడు. తనతో వాట్సాప్‌ వీడియో కాలింగ్‌ ద్వారా లైంగిక వాంఛ తీర్చాలని ఒత్తిడి చేసేవాడు. ఆ రకంగా సుమారు 300 మంది మహిళలకు వీడియో కాల్‌ చేసి వారిని నగ్నంగా చూస్తూ లైంగిక వాంఛ తీర్చుకునేవాడు.

ఫోన్‌ గ్యాలరీకి ప్రత్యేక పాస్‌వర్డ్‌
ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడే ప్రతిభ కలిగిన ప్రదీప్‌ ఈ ఏడాది ఆరంభం నుంచి ఈ వికృత చేష్టలకు తెర లేపాడు. మహిళల చిత్రాలు, వీడియో దృశ్యాలను తన సెల్‌లో భద్రపరుచుకున్నాడు. ఇందుకు ప్రత్యేక గ్యాలరీని ఏర్పాటు చేసి పాస్‌వర్డ్‌ను రక్షణగా పెట్టుకున్నాడు. మియాపూర్‌కు చెందిన ఓ మహిళ ఇలాగే మోసపోయి కొద్దిరోజుల కిందట పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేసిన మియాపూర్‌ ఎస్‌ఐ రఘురాం.. ఫోన్‌ నంబర్ల ఆధారంగా నిందితుడిని గుర్తించి చెన్నైలో పట్టుకున్నారు. నగరానికి తీసుకొచ్చి శుక్రవారం కూకట్‌పల్లి కోర్టులో హాజరుపరిచారు. నిందితుడి నుంచి స్వాధీనం చేసుకొన్న ఫోన్‌లోని డేటా బయటకు లాగేందుకు ఎఫ్‌ఎస్‌ఎల్‌కు పంపించారు. నిందితుడిని ప్రాథమికంగా విచారించిన క్రమంలో మూసాపేట, జగద్గిరిగుట్ట, సిద్దిపేటకు చెందిన పలువురు మహిళలు అతడి బారిన పడినట్లు గుర్తించారు. సమగ్ర దర్యాప్తు నిమిత్తం నిందితుడిని ఐదు రోజుల కస్టడీకి అప్పగించాలని కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. బాధితురాళ్లు ఎవరైనా ఉంటే మియాపూర్‌ ఠాణాలో సంప్రదించాలని లేదా 83329 81116 ఫోన్‌ నంబరుకు సమాచారం అందించాలని చెప్పారు.



Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.