Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 119000611
            [news_title_telugu_html] => 

వైరముత్తును ఒక్క ప్రశ్న కూడా అడగలేదే?: చిన్మయి

[news_title_telugu] => వైరముత్తును ఒక్క ప్రశ్న కూడా అడగలేదే?: చిన్మయి [news_title_english] => All men named in MeToo have been whitewashed says Chinmayi Sripaada [news_short_description] => ‘మీటూ’ ఉద్యమం కారణంగా ఎంతో మంది మహిళలు తమకు ఎదురైన లైంగిక వేధింపుల గురించి ధైర్యంగా బయటపెట్టారు. గత ఏడాది అక్టోబరులో ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద సోషల్‌మీడియా వేదికగా జాతీయ అవార్డు గ్రహీత వైరముత్తుపై... [news_tags_keywords] => vairamuthu,chinmayi sripada,metoo [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-24 21:27:02 [news_isactive] => 1 [news_status] => 2 ) )
వైరముత్తును ఒక్క ప్రశ్న కూడా అడగలేదే?: చిన్మయి - All men named in MeToo have been whitewashed says Chinmayi Sripaada - EENADU
close

తాజా వార్తలు

వైరముత్తును ఒక్క ప్రశ్న కూడా అడగలేదే?: చిన్మయి

‘మీటూ’ వల్ల చివరికి మిగిలింది ఇది!

హైదరాబాద్‌: ‘మీటూ’ ఉద్యమం కారణంగా ఎంతో మంది మహిళలు తమకు ఎదురైన లైంగిక వేధింపుల గురించి ధైర్యంగా బయటపెట్టారు. గత ఏడాది అక్టోబరులో ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద సోషల్‌మీడియా వేదికగా జాతీయ అవార్డు గ్రహీత వైరముత్తుపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. ఇది జరిగి దాదాపు ఏడాది కావొస్తోంది. ఇప్పుడు చిన్మయి మరోసారి ట్విటర్‌ వేదికగా వైరముత్తును ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. ఇన్ని రోజుల్లో ఒక్కసారి కూడా మీడియా ఆయన్ను లైంగిక వేధింపుల గురించి ఎందుకు ప్రశ్నించలేదని అడిగారు.

తాజాగా ఓ ఆంగ్ల మీడియా వైరముత్తును ఇంటర్వ్యూ చేసింది. ఈ క్రమంలో విలేకరి ఆయన్ను ‘మీటూ’ గురించి ఒక్క ప్రశ్న కూడా అడగలేదు. దీన్ని చూసిన చిన్మయి ట్విటర్‌లో స్పందించారు. ‘దాదాపు ఏడాది క్రితం వైరముత్తు వేధించాడని నేను బయటపడి చెప్పా. ఆ సమయంలో ఒక్క పత్రిక, పబ్లికేషన్‌ కూడా ఆయన్ను ఒక్క ప్రశ్న అడగలేదు. ఇలాంటి ప్రశ్నల నుంచి ఎమ్‌.జె అక్బర్‌ (లైంగిక వేధింపులు ఎదుర్కొంటోన్న ఎంపీ), వైరముత్తు ఎలా తప్పించుకుంటున్నారు?’.

‘చివరికి ‘మీటూ’ ఉద్యమంలో ఆరోపణలు ఎదుర్కొన్న పురుషులు నిర్దోషులుగా, స్వచ్ఛంగా బయటపడ్డారు. తమకు ఎదురైన వేధింపుల్ని చెప్పిన మహిళలు ‘మీటూ’ ఉద్యమానికి సంబంధించిన ప్రతి వార్తల్లోనూ ఉంటున్నారు. పురుషులకు వచ్చిన నష్టం ఏమీ లేదు’ అని చిన్మయి ట్వీట్లు చేశారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.