Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 119001115
            [news_title_telugu_html] => 

అవసరమైతే తప్ప హారన్‌ కొట్టొద్దు..!

[news_title_telugu] => అవసరమైతే తప్ప హారన్‌ కొట్టొద్దు..! [news_title_english] => Kolkata Over 3000 fined in 4 days of anti honking drive [news_short_description] => అధికమవుతున్న శబ్ద కాలుష్య తీవ్రత తగ్గించేందు పశ్చిమబంగ రాజధాని కోల్‌కతా పోలీసులు ‘నో హాంకింగ్‌’ డ్రైవ్‌ను ప్రారంభించారు. ఆగస్టు 21న ప్రారంభమైన ఈ డ్రైవ్‌ ద్వారా నగరంలో ఇప్పటికే పోలీసులు 3వేలకు పైగా వాహనదారులపై జరిమానా విధించారు. [news_tags_keywords] => kolkata ,traffic,police,no honking drive [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-26 01:43:38 [news_isactive] => 1 [news_status] => 2 ) )
అవసరమైతే తప్ప హారన్‌ కొట్టొద్దు..! - Kolkata Over 3000 fined in 4 days of anti honking drive - EENADU
close

తాజా వార్తలు

అవసరమైతే తప్ప హారన్‌ కొట్టొద్దు..!

కోల్‌కతా: అధికమవుతున్న శబ్ద కాలుష్య తీవ్రత తగ్గించేందుకు పశ్చిమబంగ రాజధాని కోల్‌కతా పోలీసులు ‘నో హాంకింగ్‌’ డ్రైవ్‌ను ప్రారంభించారు. ఆగస్టు 21న ప్రారంభమైన ఈ డ్రైవ్‌ ద్వారా నగరంలో ఇప్పటికే పోలీసులు 3వేలకు పైగా వాహనదారులపై జరిమానా విధించారు. ఈ డ్రైవ్ ద్వారా అధిక శబ్ద కాలుష్యం చేసిన వాహన దారులపై రూ.100 జరిమానా విధించాలని పోలీసులు ఇదువరకే నిర్ణయించారు. ఆగస్టు 21న ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం 3150 మందిపై జరిమానా విధించినట్లు డీసీపీ సంతోష్‌ పాండే తెలిపారు. ఈ సందర్బంగా మాట్లాడిన ఆయన.. డ్రైవ్‌ ప్రారంభించిన మొదటి రోజున 955 మందికి జరిమానా విధించామన్నారు. ఈ డ్రైవ్‌ను మొత్తం నగరంలోని 700 ప్రాంతాల్లో అమలు చేశామన్నారు. అధిక శబ్ద కాలుష్యం చేసే వారిపై పశ్చిమబంగ మోటర్‌ వాహన నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అందుకే మేము డ్రైవర్‌లకు అనవసరంగా హారన్‌ ఉపయోగించవద్దని సూచించామన్నారు. అవసరం లేకున్నా హారన్‌ కొట్టే విధానాన్ని మార్పు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. శబ్ద కాలుష్యం మానసికంగా, శారీరకంగా మనిషిపై ప్రభావం చూపుతుంది. ఇది మనిషిలో ఒత్తిడి పెంచి మానసికంగా సమస్యలను దరిచేరుస్తుంది. ఎక్కువగా శబ్ద కాలుష్యానికి గురైన వారు వినికిడి శక్తిని కోల్పోయే ప్రమాదం ఉందని  వైద్య నిపుణులు హెచ్చరించారు. 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.