Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 119001122
            [news_title_telugu_html] => 

పరాజయాలే ఈ స్థాయికి చేర్చాయి: హృతిక్‌

[news_title_telugu] => పరాజయాలే ఈ స్థాయికి చేర్చాయి: హృతిక్‌ [news_title_english] => I learnt from my failures says Hrithik Roshan [news_short_description] => పరాజయాలే ఈ రోజు తనను ఈ స్థాయికి చేర్చాయని బాలీవుడ్‌ గ్రీక్‌గాడ్‌ హృతిక్‌ రోషన్‌ అన్నారు. 19 ఏళ్ల క్రితం హీరోగా తొలి సినిమా ‘కహోనా ప్యార్‌హై’తో ఆయన హిట్‌ అందుకున్నారు. ఆ తర్వాత అనేక విజయాలు చూసిన ఆయన సినీ కెరీర్‌లో... [news_tags_keywords] => Hrithik Roshan,actor,bollywood [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => QpvEWVVnICE [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-25 19:31:39 [news_isactive] => 1 [news_status] => 2 ) )
పరాజయాలే ఈ స్థాయికి చేర్చాయి: హృతిక్‌ - I learnt from my failures says Hrithik Roshan - EENADU
close

తాజా వార్తలు

పరాజయాలే ఈ స్థాయికి చేర్చాయి: హృతిక్‌

ముంబయి: పరాజయాలే ఈ రోజు తనను ఈ స్థాయికి చేర్చాయని బాలీవుడ్‌ గ్రీక్‌గాడ్‌ హృతిక్‌ రోషన్‌ అన్నారు. 19 ఏళ్ల క్రితం హీరోగా తొలి సినిమా ‘కహోనా ప్యార్‌హై’తో ఆయన హిట్‌ అందుకున్నారు. ఆ తర్వాత అనేక విజయాలు చూసిన ఆయన సినీ కెరీర్‌లో ఫ్లాప్‌లు కూడా ఉన్నాయి. నటుడిగా హృతిక్‌ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ఇటీవల ‘సూపర్‌ 30’తో మరో హిట్‌ తన ఖాతాలో వేసుకున్నారు. ఇందులో ఆయన నటనకు ప్రశంసల జల్లు కురిసింది. అయితే తన వైఫల్యాలే ఉన్నత స్థాయికి చేరేందుకు సహకరించాయని ఆయన తాజా ఇంటర్వ్యూలో అన్నారు. ఆ విశేషాలివి..

పాఠాలు నేర్చుకున్నా

‘ఇవాళ నా జీవితంలో వెనక్కి తిరిగి చూసుకుంటే.. చాలా దూరం ప్రయాణించినట్లు అనిపిస్తోంది. ఈ ప్రయాణంలో విజయాలు, అపజయాలు ఉన్నాయి. ముఖ్యంగా నా ఫెయిల్యూర్‌ నుంచి ఎన్నో గుణపాఠాలు నేర్చుకున్నా. ఇప్పుడు నేర్చుకున్న పాఠాల్ని దృష్టిలో ఉంచుకుని కథల్ని ఎంపిక చేసుకుంటున్నా. నా పరాజయాలే ఇవాళ నేను ఈ స్థాయిలో ఉండేందుకు సహకరించాయి’.

నాన్న ఆ మాటన్నారు

‘నిజాయితీగా చెబుతున్నా.. సమాజానికి ఓ సందేశం ఇవ్వాలనే ఉద్దేశంతో నేను ‘సూపర్‌ 30’ సినిమాలో నటించలేదు. ఇది గొప్ప కథ కాబట్టి నటించా. ‘నువ్వు సమాజానికి సందేశం ఇవ్వాలి అనుకుంటే సినిమాలు తీయొద్దు.. డాక్యుమెంటరీ తీసుకో’ అని మా నాన్న నాతో అన్నారు. ప్రేక్షకులకు వినోదం పంచడం కోసం సినిమా తీయాలని చెప్పారు. ఇది ఓ గొప్ప వ్యక్తి బయోపిక్‌ కాబట్టి నటించమని అడిగితే నేను నటించలేను. స్క్రిప్టు ఎంటర్‌టైన్‌ చేసే విధంగా లేకపోతే సంతకం చేయలేను. నచ్చిన కథల కోసమే నేను ఎదురుచూస్తున్నా’.

వసూళ్లు వస్తాయని..

అనంతరం ‘సూపర్‌ 30’ సినిమా దేశవ్యాప్తంగా రూ.146 కోట్లు రాబట్టడం గురించి ప్రశ్నించగా.. ‘బాక్సాఫీసు వసూళ్లను పెద్దగా పట్టించుకోను. కలెక్షన్స్‌ ద్వారానే ఎంత మంది ప్రజలకు మన సినిమా చేరువైందనే విషయం అర్థం అవుతుంది. కానీ వసూళ్లను దృష్టిలో ఉంచుకుని, ఈ కథ రూ.100 కోట్లు సాధించే అవకాశం ఉందని ఊహించుకుని.. నేను కథను ఎంచుకోను. ప్రేక్షకులు సినిమాతో కనెక్ట్‌ అవడం, వారు సినిమాను ఎంజాయ్‌ చేయడం ముఖ్యం. రూ.100 కోట్లు రాబట్టడం అనేది కేక్‌పై ఉన్న అందమైన చెర్రీలాంటిది మాత్రమే’.

ప్రయోగాలు ఇష్టం

‘నేను ప్రతి సారి సరికొత్త పాత్రలతో ప్రేక్షకుల ముందుకు రావడానికి ప్రయత్నిస్తుంటా. ఈ కోవలో వచ్చినవే.. ‘కోయీ మిల్‌ గయా’లోని రోహిత్‌, ‘కాబిల్‌’లోని రోషన్‌, ‘సూపర్‌ 30’లోని ఆనంద్‌ కుమార్‌. ఇప్పుడు ఓ నటుడిగా ఇంకా బలంగా తయారైనట్లు అనిపిస్తోంది. ఈ ప్రయాణాన్ని నేను చాలా ఎంజాయ్‌ చేశా. ఇకపై కూడా ఇలానే శ్రమిస్తా’.

 



Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.